Forced Anal Sex: అసహజ శృంగారం తీవ్రమైన నేరం,  కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు, ఇద్దరు వైద్యులు రెండు గంటల పాటు యానల్ సెక్స్ చేసి నరకం చూపించారని కోర్టుకు తెలిపిన వైద్య విద్యార్థి

ఐపిసి సెక్షన్ 377 (under Section 377 IPC) ప్రకారం అది నేరమని..నిందితుడు అసహజ శృంగారం (Forced Anal Sex) చేశాడని తేలితే కఠిన శిక్ష తప్పదని తీర్పు వెలువరించింది.

Calcutta High Court (Photo-ANI)

Calcutta, Feb 23: యానల్ సెక్స్‌పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఐపిసి సెక్షన్ 377 (under Section 377 IPC) ప్రకారం అది నేరమని..నిందితుడు అసహజ శృంగారం (Forced Anal Sex) చేశాడని తేలితే కఠిన శిక్ష తప్పదని తీర్పు వెలువరించింది. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 377 (అసహజ నేరాలు) ప్రకారం.. యానల్ సెక్స్ అనేది కఠినమైన నేరం కిందకు వస్తుందని Calcutta High Court తెలిపింది. వైద్యుడు ఇద్దరు విద్యార్థులపై దారుణంగా అసహజ శృంగారానికి పాల్పడిన కేసులు హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా ఇద్దరు నిందితులపై IPC సెక్షన్లు 506 (నేరపూరిత బెదిరింపు), 120B (నేరపూరిత కుట్ర) అభియోగాలు మోపారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గల ఓ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లు, వైద్య విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితుల్లో ఒకరైన డాక్టర్ తనను బలవంతంగా బట్టలు విప్పి సుమారు రెండు గంటల పాటు అసహజ శృంగారం చేస్తూ నన్ను హింసించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ సంఘటన గురించి ఇతరులతో మాట్లాడకుండా నిందితులిద్దరూ తనను బెదిరించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.

యానల్ సెక్స్‌పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు, ఐపిసి సెక్షన్ 377 ప్రకారం అది నేరం, అసహజ శృంగారం చేశాడని తేలితే కఠిన శిక్ష తప్పదని తీర్పు

అయితే రాజకీయ వైరం కారణంగానే ఫిర్యాదుదారు తమపై తప్పుడు కేసు పెట్టారని నిందితులైన వైద్యులు వాదించారు. ఈ విషయంలో, ఫిర్యాదుదారుడు పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడితో సమావేశాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఆరోపించిన సంఘటనపై ముఖ్యమంత్రికి లేఖ రాశారని కూడా హైలైట్ చేశారు. కేవలం రాజకీయంగా సెటిల్ చేసుకునేందుకే ఫిర్యాదు చేసినట్లు నిందితులు పేర్కొన్నారు.దీంతో నిందితులు ఇద్దరూ తమపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు.

ఆరోపణల తీవ్రత గురించి వ్యాఖ్యానించిన జస్టిస్ దత్, ఈ సంఘటన నిజమైతే, భయానకంగా ఉందని , మానసిక క్షీణతకు దారితీస్తుందని, ఒక వ్యక్తి జీవితానికి మచ్చగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. ఇక బాధితుడిని పరిశీలించిన తర్వాత తయారు చేసిన వైద్య నివేదికలో అతని అంగ రంధ్రం ఆరోగ్యంగా ఉందని, తాజాగా లేదా ఇటీవలి గాయం ఏమీ లేదని రిపోర్ట్ పేర్కొంది.

యోనీలో వేలు పెట్టడం నేరం కిందకు రాదని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఎటువంటి గాయం లేదా పూర్తి అంగ సంపర్కానికి సంబంధించిన ఆధారాలు కనుగొనబడలేదని నివేదిక అభిప్రాయాన్ని కోర్టుకు అందించింది . పరీక్షను నిర్వహించి, నివేదికను తయారు చేసిన వైద్యాధికారిని విచారణలో పరిశీలించాలని, తద్వారా పై నిర్ధారణను స్పష్టం చేయాలని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఇందుకోసం న్యాయ ప్రయోజనాల దృష్ట్యా విచారణ అవసరమని కోర్టు పేర్కొంది.అసంపూర్తిగా ఉన్న అంగ సంపర్కం కూడా చొచ్చుకుపోవడాన్ని ఏర్పరుస్తుందని, IPCలోని సెక్షన్ 377 ప్రకారం నేరాన్ని రూపొందించడానికి అదే ఒక అంశంగా ఉంటుందని జస్టిస్ శంపా దత్ (పాల్) సూచించారు.

కేసు డైరీలో ఫిర్యాదుదారు ఆరోపణలను సమర్ధించే అనేక వాంగ్మూలాలు ఉన్నాయని, నిందితులపై ప్రాథమిక కేసును నమోదు చేసినట్లు న్యాయమూర్తి గుర్తించారు. అందువల్ల, 2019 కేసులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ విచారణను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. పిటిషనర్లకు కూడా విచారణలో విచారణకు అవకాశం ఉంటుందని సూచించిన తర్వాత కేసును రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది మిలోన్‌ ముఖర్జీ , న్యాయవాదులు ఉసోఫ్‌ అలీ దేవాన్‌, ఆసిఫ్‌ దివాన్‌ హాజరయ్యారు. రాష్ట్రం తరపున న్యాయవాదులు అరిజిత్ గంగూలీ, సంజీబ్ కుమార్ దాన్ వాదించారు.