Uttar Pradesh: మీ కూతురును వెతకాలంటే డీజిల్‌కు డబ్బులు ఇవ్వండి, యూపీలోని కాన్పూర్ పోలీసుల నిర్వాకం, తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన మహిళ

ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో పోలీసులు తన కూతురును వెతికేందుకు ఓ మహిళ దగ్గర లంచం డిమాండ్ చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెలలో కిడ్నాప్ అయిన తన కూతురుని వెతకాలంటే జీపుకి డీజిల్ అవసరమని .. కాబట్టి మీ కూతురును వెతకాలంటే వాహనాల్లో డీజిల్ నింపడానికి (Give Diesel, Will Search) రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లించాలని పోలీసులు (Kanpur police) డిమాండ్ చేశారని ఆ మహిళ ఆరోపించింది.

Police officers. (Representational Image/ Photo Credits: PTI)

Lucknow, Feb 2: ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో పోలీసులు తన కూతురును వెతికేందుకు ఓ మహిళ దగ్గర లంచం డిమాండ్ చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెలలో కిడ్నాప్ అయిన తన కూతురుని వెతకాలంటే జీపుకి డీజిల్ అవసరమని .. కాబట్టి మీ కూతురును వెతకాలంటే వాహనాల్లో డీజిల్ నింపడానికి (Give Diesel, Will Search) రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లించాలని పోలీసులు (Kanpur police) డిమాండ్ చేశారని ఆ మహిళ ఆరోపించింది.

దీంతో చేసేదేమి లేక ఆ మహిళ ( differently abled Woman) ఆ మొత్తం చెల్లించిందని అయినప్పటికీ ఫిర్యాదును మాత్రం పోలీసులు పట్టించుకోలేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమార్తె క్యారెక్టర్‌ గురించి అసభ్యంగా మాట్లాడారని ఆ తల్లి ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది.

గుడియా అనే మహిళ సోమవారం కాన్పూర్ పోలీసు ఉన్నతాధికారిని ఈ కేసు విషయమై సంప్రదించింది. కొద్దిపాటి భూమిని కలిగి ఉన్న వితంతువు అయిన ఎంఎస్ గుడియా గత నెలలో తప్పిపోయిన తన కుమార్తె గురించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే పోలీసులు ఆమెకు సహాయం చేయలేదని అమె ఆరోపించారు. పోలీసులు 'మేము చూస్తున్నాం' అని ఆమెకు చెప్పారు. కొన్నిసార్లు వారు నన్ను దూరంగా పొమ్మని చెబుతారు, నీ కుమార్తె ఎవరితో వెళ్లిందో అని తప్పుగా మాట్లాడుతారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిందని అక్కడి మీడియా తెలిపింది.

గుర్తు తెలియని మృతదేహాన్ని 2 కిలోమీటర్లు మోసిన మహిళా ఎస్సై, అంత్యక్రియలు కూడా జరిపించిన శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష, ప్రశంసలు కురిపించిన తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలు

"కొన్నిసార్లు వారు 'చల్ యాహన్ సే' ("ఇక్కడి నుంచి వెళ్లండి) అని చెప్తారు. నేను వారి వాహనాల్లో డీజిల్ నింపాను. నేను 3-4 ట్రిప్పులకు చెల్లించాను.డీజిల్ కోసం డబ్బును ఏర్పాటు చేయడానికి బంధువుల నుండి రుణాలు తీసుకున్నట్లు ఆమె మీడియాకు చెప్పారు. "నేను 10,000-15,000 రూపాయలు విలువైన డీజిల్ ఏర్పాటు చేశానని పోలీసు చీఫ్తో చెప్పాను. నేను ఇలా ఎలా ముందుకు వెళ్ళగలనని ఆమె మీడియాతో అన్నారు.

Here's Kanpur Nagar Police Tweet

గుడియా తన ఆవేదనను  వివరించే వీడియో క్లిప్‌లు వైరల్ అయిన తరువాత, కాన్పూర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. కమిషనర్ కార్యాలయం నుండి సంబంధిత పోలీస్ స్టేషన్ వరకు వృద్ధ మహిళను పోలీసు వాహనంలో నడుపుతున్న వీడియోను పోలీసు శాఖ ట్వీట్ చేసింది. తన కుమార్తెను వెతికేందుకు నాలుగు టీంలు ఏర్పడ్డాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఉన్నట్టుండి నేలపై కుప్పకూలిన మనిషి, సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాల్ని నిలబెట్టిన సీఐఎస్ఎఫ్ జవాను, ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

"ఈ కేసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని కోరాము. ఆమె ఆరోపణలన్నీ పరిశీలించబడతాయి మరియు ఎవరైనా దోషిగా తేలితే మేము చర్యలు తీసుకుంటాము" అని కాన్పూర్‌లోని సీనియర్ పోలీసు అధికారి బ్రజేష్ కుమార్ శ్రీవాస్తవ మీడియాతో అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement