New Delhi, Jan 20: ఢిల్లీలో అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి సీఐఎస్ఎఫ్ జవాను సమయస్ఫూర్తితో స్పందించి తన ప్రాణాన్ని (CISF Jawan Saves Man) నిలబెట్టాడు. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో (Delhi Metro station) సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జనక్‌పురికి చెందిన సత్యనారన్ అనే వ్యక్తి దబ్రీ మోర్ మెట్రో స్టేషన్‌లో ఉన్నట్టుండి నేలపై ( Man Collapsed) కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అక్కడి సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాడు. నేలపై పడి ఉన్న సత్యనారన్‌కు సీపీఆర్(కార్డియోపల్మనరీ రెససిటేషన్) చేసి ప్రాణం రక్షించాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి సెల్యూట్, నిజంగా అతను రియల్ హీరో.. ఓ విలువైన ప్రాణం కాపాడిన ఆ వ్యక్తికి ధన్యవాదాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Here's Video
#CISF personnel saved a precious life by giving CPR to a passenger namely Mr Satyanaran, R/O Janakpuri @ Dabri More Metro Station, DMRC, Delhi. Mr Satyanaran thanked CISF profusely for saving his life. pic.twitter.com/iqlMyeSIhd
— CISF (@CISFHQrs) January 18, 2021
ఢిల్లీలోనే నివాసం ఉంటున్న సదరు ప్రయాణికుడు ఆస్పత్రిలో చేరేందుకు అంగీకరించలేదనీ.. వెంటనే ప్రయాణమై వెళ్లిపోయాడని అధికారులు వెల్లడించారు. గుండె కొట్టుకోవడం నిలిచిపోయినప్పుడు రోగి ప్రాణాలు కాపాడేందుకు నిర్వహించే అత్యవసరన వైద్య ప్రక్రియనే సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిసాసిటేషన్) అంటారు. ఢిల్లీ మెట్రోలో భద్రతను సీఐఎస్ఎఫ్ సిబ్బంది పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.