kasibugga SI Carry Unidentified Corpse In Srikakulam(Photo-Twitter)

Amaravati, Feb 1: మానవత్వం చాటుకున్న మహిళా ఎస్సైపై (Woman SI sirisha) తెలుగు రాష్ట్రాల పోలీస్ శాఖలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందింది. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. (Kasibugga SI Sirisha) ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్థించారు.

ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో 2కిలో మీటర్ల వరకు మోసుకు వెళ్లారు.స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు మృతదేహాన్ని అప్పగించడమేగాక.. దాని నిర్వాహకులు చిన్ని కృష్ణతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీసులు.. మహిళా ఎస్సై మంచి మనస్సును అభినందిస్తున్నారు.

కాగా కాశీబుగ్గ ఎస్సై శిరీష పొలం గట్లు, అటవీప్రాంతాలు దాటుకుంటూ ఓ స్ట్రెచర్ పై మోసుకురావడం పట్ల (kasibugga SI Carry Unidentified Corpse) సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది.

ఉన్నట్టుండి నేలపై కుప్పకూలిన మనిషి, సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాల్ని నిలబెట్టిన సీఐఎస్ఎఫ్ జవాను, ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఏపీ పోలీస్ విభాగం, తెలంగాణ పోలీస్ విభాగం కూడా ఎస్సై శిరీషను అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఆమె వీడియోను కూడా పంచుకుంది. కాశీబుగ్గ ఎస్సై శిరీష మానవీయ దృక్పథాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు.

Here's AP Police Tweet

Here's TS Police Tweet

ఏపీలోని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌‌కు చెందిన ఎస్సై కొత్త శిరీషను తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సేవలను కొనియాడుతూ సెల్యూట్ మేడమ్ అంటూ ట్వీట్ చేశారు. ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని, ఇలాంటి పనులే చేయాలనే సమాజంలో... ఆమె ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారానికి, చేస్తున్న సేవకి సగర్వంగా సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసుల ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రాష్ట్రాలుగా వేరైనా.. పోలీస్ అనే వృత్తి రెండు రాష్ట్రాల పోలీసులను ఒక్కటి చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.