Chandrakant Patil: సుప్రీయా సూలే..నీకు రాజకీయాలు ఎందుకు వంట చేసుకోమన్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్, మండిపడుతున్న ఎన్సీపీ పార్టీ
'మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకో' అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఉద్యోగాలు, విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Mumbai, May 26: మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకో' అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ఉద్యోగాలు, విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఓబీసీ రిజర్వేషన్లపై జరిగిన నిరసన కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ.. 'మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో' అంటూ సుప్రియా సులేను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మసీదులు తవ్వుదాం, శవాలు ఉంటే మీవి, శివలింగాలు ఉంటే మావి, హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
మధ్యప్రదేశ్‌లో ఓబీసీ కోటా అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని..ఆ రాష్ట్ర సీఎం ఢిల్లీకి వచ్చి..అక్కడ ఎవర్నో కలిసారని, ఆ మరుసటి రెండు రోజులకు ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సుప్రీయా సూలే ఓ కార్యక్రమంలో కామెంట్ చేశారు.ఈ కామెంట్ పై మాట్లాడుతూ చంద్రకాంత్ పాటిల్ సులేపై ఈ వ్యాఖ్యలు చేశారు.ద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. సుప్రీయా సూలే వంట చేసుకోవాలని వ్యాఖ్యనించిన చంద్రకాంత్ మీ భార్యకు వంటలో సహాయం చేయండి అంటూ వ్యాఖ్యానించింది.