Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, రాహుల్ గాంధీతో వినేశ్ ఫోగాట్ భేటీ
పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన స్టార్ అథ్లెట్, రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి
New Delhi, Sep 4: పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన స్టార్ అథ్లెట్, రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, బజరంగ్ పూనియా బుధవారం ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో కలిసి వినేశ్, బజరంగ్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని ఢిల్లీకి తిరిగి వచ్చిన వినేశ్ ఫోగాట్ కు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా స్వాగతం పలికారు.
రెజ్లర్లు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వినేశ్ ను పార్టీలో చేర్చుకుని హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.అయితే రాహుల్ గాంధీతో రెజ్లర్ల భేటీకి సంబంధించిన వివరాలను అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు వినేశ్, బజరంగ్ పూనియా కానీ బయటపెట్టలేదు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల రణక్షేత్రం, మోడీ వర్సెస్ రాహుల్..హోరెత్తనున్న ప్రచారం, అగ్రనేతల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు!
గతేడాది బీజేపీలో చేరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన బబితా ఫోగాట్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బబితను మరోమారు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బబితకు పోటీగా వినేశ్ ను నిలబెట్టాలని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.