Haryana Triple Murder: ఒళ్లు గగుర్పొడిచే ఘటన, ముగ్గురిని చంపి శవాలతో సెక్స్, హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణ సంఘటన, నిందితుడ్ని అరెస్ట్ చేసిన పానిపట్ పోలీసులు
ఓ కామపిశాచి భార్యను, అత్తను మరదలని చంపి (Haryana Triple Murder) ఆ శవాలతో శృంగారం జరిపాడు. ఈ దారుణమైన ఘటనకు కారణం భార్యపై అనుమానం పెంచుకోవడమేనని తెలుస్తోంది. ఘటన వివరాల్లోకెళితే.. హర్యానాలోని పానిపట్ జిల్లాలో పట్టి కలియానా గ్రామానికి చెందిన వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అత్త, మరదలు అందుకు సహాయం చేస్తున్నారని భావించాడు. దీంతో వారిపై కక్ష పెంచుకుని హత్యకు (Man kills wife, sister-in-law and mother-in-law) పథకం రచించాడు.
Chandigarh, Sep 26: హర్యానా రాష్ట్రంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఓ కామపిశాచి భార్యను, అత్తను మరదలని చంపి (Haryana Triple Murder) ఆ శవాలతో శృంగారం జరిపాడు. ఈ దారుణమైన ఘటనకు కారణం భార్యపై అనుమానం పెంచుకోవడమేనని తెలుస్తోంది. ఘటన వివరాల్లోకెళితే.. హర్యానాలోని పానిపట్ జిల్లాలో పట్టి కలియానా గ్రామానికి చెందిన వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని.. అత్త, మరదలు అందుకు సహాయం చేస్తున్నారని భావించాడు. దీంతో వారిపై కక్ష పెంచుకుని హత్యకు (Man kills wife, sister-in-law and mother-in-law) పథకం రచించాడు.
కొద్దిరోజుల క్రితం భార్య, మరదలికి మత్తు మందు ఇచ్చి కత్తితో నరికి చంపేశాడు. అనంతరం వారి శవాలతో శృంగారం చేశాడు. ఆ వెంటనే మృతదేహాలను దుప్పట్లో చుట్టి దూరంగా పడేశాడు. మూడు రోజుల తర్వాత అత్తగారి ఊరికి వెళ్లి ఆమెను అక్కడినుంచి తీసుకొచ్చాడు. అనంతరం అత్తను కూడా చంపి, ఆమె శవంతో కూడా శృంగారం చేశాడు. ఆ తర్వాత శవాన్ని మంటల్లో తగలబెట్టాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఆ ముగ్గురి శవాలు మూడు వేరువేరు ప్రదేశాలలో వారికి లభించాయి. హాసన్‌పై అనుమానంతో అతడ్ని ప్రశ్నించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో గురువారం పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
సెప్టెంబర్ 6 న జిల్లాలోని సమల్ఖా పట్టణంలో ఈ హత్యలు జరిగాయి. బాధితుల మృతదేహాలను సెప్టెంబర్ 6, 7 మరియు 8 తేదీలలో మూడు వేర్వేరు ప్రదేశాల్లో కనుగొన్నారు. ముగ్గురు మహిళలను హతమార్చినట్లు మరియు వారి శరీరాలపై అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.
హత్యల తరువాత, ఈ కేసును దర్యాప్తు చేయడానికి పానిపట్ డిప్యూటీ సూపరింటెండెంట్ (డిఎస్పి) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో సమల్ఖాలోని అద్దె ఇంట్లో నివసించాడుని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 302 (హత్య) మరియు 201 (సాక్ష్యాలను దాచడం) కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.