Snake Being Pulled Out From Woman's Throat (Photo Credits: Video Screengrab/ YouTube)

రష్యాలో ఓ భయానక సంఘటన జరిగింది. ఈ సంఘటన తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ నిద్ర పోతుండగా ఆమె నోట్లోకి నాలుగు అడుగుల పాము (Snake Pulled From Woman Mouth) వెళ్లిపోయింది. రష్యాలోని డజెస్థాన్‌ ప్రాంతంలోని లెవాషి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఓ యువతి అలా నిద్రపోయినప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె నోట్లోకి ఏకంగా నాలుగు అడుగుల పొడవున్న పాము (snake slithers into Russian woman mouth) వెళ్లింది.

తెల్లవారిన తర్వాత ఆమెకు (Russian woman) కడుపులో ఏదో తిరుగుతున్నట్టు, కడుపంతా తిప్పుతున్నట్లు అనిపించి సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్య సిబ్బంది ఆమె కడుపును స్కాన్‌ చేయగా, కడుపులో ఏదో పాములాంటి జీవి ఉన్నట్లు కనిపించింది. ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లాక ఓ డాక్టర్‌ ఆమె నోట్లోకి పైపును పంపించి వినూత్న పద్ధతిలో ఆపరేషన్‌ చేశారు.

Here;s Video 

అయితే అనుకోకుండా ఆ పైపుతోపాటు బయటకు వచ్చిన పాము కొసను పట్టుకొని ఓ నర్సు భయం, భయంతో ఆ పామును పూర్తిగా బయటకు లాగేసింది. ఆ పామును వైద్యం చేసిన తరువాత చెత్త పడేసే బకెట్లో వేశారు. అప్పటికీ ఆ పాముకు ప్రాణం ఉందా, లేదా అన్న విషయం తెలియలేదు.ఏసీ నుంచి 40 పాము పిల్లలు బయటకు

అయితే బాధితురాలి పేరునుగానీ, ఆమె లోపలికి పాము ఎలా దూరింది..అది ఎలాంటి రకమైన పామో వైద్యులు వెల్లడించలేదు. ఈ అరుదైన ఆపరేషన్‌ను వీడియోలో చిత్రీకరించిన ఆ ఆస్పత్రి సిబ్బంది, ఆ తర్వాత దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అది వైరల్‌ అవుతోంది. నిద్రలో మనిషి ఫ్యాంటులో దూరిన పాము

లెవాషి గ్రామంలో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణమేనట. ఆరు బయట పడుకోవడం వల్ల నోట్లో, ముక్కుల్లో పాములు, క్రిమి కీటకాలు దూరుతాయని స్థానికులు తెలిపారు. సముద్ర మట్టానికి 4,165 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గ్రామంలో 11,500 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భ‌య‌భ్రాంతుల‌కు గురవుతున్నారు.