Cobra | Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Mirzapur, July 31: ఎదురుగా పాము కనిపిస్తే చాలు.. చాలామంది భయంతో పారిపోతారు. అలాంటిది ఏకంగా నిద్రిస్తున్న మనిషి ఫ్యాంటులో (Snake Enters Man's Pants) దూరితే ఎలా ఉంటుంది. ఆ మనిషి భయాన్ని ఓ సారి ఊహించుకుంటే భయంతో వణికిపోతాం కదా.. సరిగ్గా అలాంటి సంఘటనే (terrifying incident) యుపీలో జరిగింది. ఏసీ నుంచి 40 పాము పిల్లలు బయటకు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి, పాము పిల్లలని అడవిలో వదిలేసిన అక్కడి వాసులు

ఘటన వివరాల్లోకెళితే.. యూపీలోని మీర్జాపూర్‌లో (Uttar Pradesh Mirzapur) ఓ యువకుడి ప్యాంట్‌లో పాము దూరి.. ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. మీర్జాపూర్‌ జిల్లాలోని సికిందర్ పూర్ గ్రామంలో అంగ‌న్‌వాడీ కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప‌నుల‌ను పూర్తి చేసేందుకు ఎనిమిది ‌మంది కార్మికులు ప‌ని చేస్తున్నారు. వీరంద‌రూ రాత్రిళ్లు అక్క‌డే ఆరుబ‌య‌ట నిద్రిస్తారు. ఇంత‌లో ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఏమో కానీ ఓ పెద్ద పాము (Snake) మ‌రెక్క‌డా చోటు లేన‌ట్లు నిద్రపోతున్న లావ్‌రేశ్‌ కుమార్ అనే కార్మికుడి ప్యాంటులో దూరింది. ఉద‌యం మూడు గంట‌ల‌కు ప్యాంటులో ఏదో క‌దులుతున్న‌ట్లు అత‌డికి అనిపించింది.

Here's terrific incident Video

అది పామ‌ని తెలిసేస‌రికి భ‌యంతో నోట మాట రాలేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని పక్క‌నే ఉన్న కార్మికుల‌కు చెప్ప‌డంతో వారు పాముల‌ను ప‌ట్టేవాళ్లను పిలుచుకు వ‌చ్చేందుకు ప‌రిగెత్తుకెళ్లారు. మ‌రోవైపు క‌దిలితే ఆ పాము ఎక్క‌డ కాటు వేస్తోంద‌న‌న్న భ‌యంతో ఏడు గంట‌ల వ‌ర‌కు అత‌ను స్థంభాన్ని ప‌ట్టుకుని క‌ద‌ల‌కుండా నిల్చున్నాడు. అనంత‌రం పాములు ప‌ట్టే వ్య‌క్తి వ‌చ్చి అత‌డి ప్యాంటు విప్పి పామును బ‌య‌ట‌కు తీశారు. అది విష‌స‌ర్ప‌మ‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు. అదృష్టం బాగుండి ఎట్ట‌కేల‌కు ఆ వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్రస్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ముందు జాగ్రత్తగా అంబులెన్స్‌ను సిద్ధం చేశామని.. అతడికి ఎలాంటి హాని కలగలేదని గ్రామ పెద్దలు తెలిపారు.