సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. చనిపోయిన మనిషి చిరునవ్వులు (Buddhist monk appears to SMILE) చిందిస్తూ ఉన్నాడని ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టి అందరూ దాన్ని వైరల్ చేస్తున్నారు. వందల ఏళ్ల క్రితం ఓ సాధువు మరణించారని అయినప్పటికీ అతని శరీరం, ముఖ్యంగా ఆ నవ్వు చెక్కు చెదరలేదంటూ (Dead monk smiling) కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే సోషల్ మీడియాలో విచిత్రం కనిపిస్తే చాలు షేర్లతో విరుచుకుపడే నెటిజన్లు దాన్ని భారీగా షేర్ చేస్తున్నారు. అతనికి ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆ సాధువు ఇంకా ధ్యాన ముద్రలోనే ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై Anti Fake News War Room (AFWA) నిజాలను నిగ్గు తేల్చింది. అది పచ్చి అబద్దమని తేల్చింది.
ఈ వార్త అంతా కట్టుకథని దాని వెనుక ఉన్న వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం ఫొటోలో కనిపిస్తున్న సాధువు పేరు లుయాంగ్ ఫోర్ పియాన్ గా తెలిపింది. అతడు 2017లో అనారోగ్యం కారణంగా థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో ఓ స్థానిక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. అయితే అతడి మృతదేహాన్ని (Buddhist monk) వెంటనే దహనం చేయకుండా బౌద్ధుల ఆచారం ప్రకారం రెండు నెలల పాటు భద్రపరిచి తర్వాత ఆ శవానికి కొత్త వస్త్రాలు తొడిగించారు. ఆ సందర్భంలో తీసిన ఫొటోగా దాన్ని తేల్చారు.
Here's Netizen Tweet
Please Read Thoroughly...👇🏻 🙂👇🏻
🧘♂️A mummified monk from around 100 years ago became news on websites around the world.
According to some buddhist, he's still alive and is in a deep state of meditation.🧘♂️
The body was found in the outskirts of Ulaanbaatar, Mongolia.🌨️ pic.twitter.com/NSdEmkwQ4J
— subhadip Nag (@subhadipNag10) September 18, 2020
ఇదిలా ఉంటే చనిపోయిన రెండు నెలల తరువాత కూడా ఆ శరీరం కుళ్లిపోకుండా అలాగే ఉంది. ఆయన చనిపోయిన వంద రోజుల తర్వాత మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ విషయం తెలియని నెటిజన్లు వందేళ్ల క్రితం పెట్టెలో భ్రదపరిచిన ఇతని శరీరం ఈ మధ్యే మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో లభ్యమైనట్లుగా ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వాస్తవ కథ ఇదే...
పోషల్ మీడియాలో కనిపిస్తున్న చిత్రాలు.. బౌద్ధ సన్యాసి చనిపోయిన రెండు నెలల తరువాత అతని అనుచరులు ఆ శరీరాన్ని వెలికితీసిన తరువాత ముఖం మీద చిరునవ్వు ధరించి ఉన్నట్లు చూపిస్తుంది. సన్యాసి లుయాంగ్ ఫోర్ పియాన్ (Luang Phor Pian) గత ఏడాది నవంబర్ 16 న 92 సంవత్సరాల వయసులో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఆసుపత్రిలో అనారోగ్యానికి గురై మరణించారు. మొదట కంబోడియాకు చెందిన పియాన్, తన జీవితంలో ఎక్కువ భాగం మధ్య థాయ్ ప్రావిన్స్ లోప్బురిలో ప్రసిద్ధ బౌద్ధ గురువుగా గడిపాడు, అక్కడ అతను మరణించిన తరువాత అతని శరీరాన్ని రెండు నెలల పాటు భద్రపరిచారు.
సన్యాసి లుయాంగ్ ఫోర్ పియాన్ మరణించిన రెండు నెలల తర్వాత అతని శరీరం శవపేటిక నుండి వెలికి తీయబడిన తరువాత అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. సన్యాసులు అతని వస్త్రాలు మార్చడానికి దాన్ని వెలికితీసినప్పుడు అతని శరీరం చాలా చక్కగా సంరక్షించబడిందని తెలిసి షాక్ అయ్యారు. సన్యాసులు చనిపోయిన దేహాన్ని కొత్త, శుభ్రమైన వస్త్రాలతో ముస్తాబు చేశారు. ఆశ్చర్యకరంగా, పియాన్ మృతదేహం అప్పుడు నవ్వుతూ కనిపించింది, అనుచరులు నమ్మశక్యం కాని క్షణం యొక్క చిత్రాలను తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్యాసి అనుచరులు ఆయన మరణించిన 100 వ రోజున జరిగే ఒక కార్యక్రమంలో చివరకు విశ్రాంతి తీసుకునే వరకు ఆయన కోసం ప్రార్థన కొనసాగించి దహన సంస్కారాలు నిర్వహించారు.