Covid-19 Vaccine: పెరుగుతున్న నకీలీ వ్యాక్సిన్ల బెడద, మీరు తీసుకునే వ్యాక్సిన్ అసలైనదా..నకిలీదా తెలుసుకోవడం ఎలా?, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు ఓ సారి చెక్ చేసుకోండి
నకిలీ టీకాలను ఎలా గుర్తించాలో (How to identify fake Covid-19 vaccine) అన్నది వివరించింది. భారత్‌లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ నకిలీ వెర్షన్ల గురించి అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రచారం జరుగుతున్నది.
New Delhi, Sep 5: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Covid-19 Vaccine)ఊపందుకోవడంతో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. నకిలీ టీకాలను ఎలా గుర్తించాలో (How to identify fake Covid-19 vaccine) అన్నది వివరించింది. భారత్‌లో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ నకిలీ వెర్షన్ల గురించి అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రచారం జరుగుతున్నది. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సీజ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అప్రమత్తం చేసింది. భారత్‌లో కూడా నకిలీ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అమ్ముతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై దర్యాప్తును ప్రారంభించింది.
ఈ నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు (Govt issues guidelines) జారీ చేసింది. ప్రస్తుతానికి, భారతీయ మార్కెట్లో కరోనా వైరస్ అరికట్టడం కోసం దేశంలో మూడు వ్యాక్సిన్లను వినియోగిస్తున్నాము. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి. ఈ వ్యాక్సిన్లు ఒరిజినల్ లేదా నకిలీదా అని చెక్ చేయడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
కోవిషీల్డ్
కోవిషీల్డ్ బాటిల్ కు ఈ క్రింది వివరాలు ఉండాలి
ఎస్ఐఐ ప్రొడక్ట్ లేబుల్
ట్రేడ్ మార్క్ తో బ్రాండ్ పేరు(కోవిషీల్డ్) ఉండాలి
జనరిక్ పేరు ఫాంట్ అన్ బోల్డ్ గా ఉంటుంది
"(రీకాంబినెంట్)" అదే ఫాంట్ తో జనరిక్ పేరు దిగువ ఉంటుంది.
సీజీఎస్ సేల్ స్టాంప్ కొరకు కాదు.
ఎస్ఐఐ లోగో కచ్చితంగా ఉండాలి.
లేబుల్ కలర్ షేడ్ ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది. అల్యూమినియం ఫ్లిప్ ఆఫ్ సీల్ అనేది ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది.
మొత్తం లేబుల్‌కు ప్రత్యేక తేనెగూడు డిజైన్ ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట కోణంలో మాత్రమే కనిపిస్తుంది.
కొవాక్సిన్
బుడ్డి లేబుల్ మీద డీఎన్ఎ వంటి నిర్మాణం ఉంటుంది.
కోవాక్సిన్ స్పెల్లింగ్ "ఎక్స్"లో గ్రీన్ కలర్ ఉంటుంది.
కొవాక్సిన్ స్పెల్లింగ్ పై హోలో గ్రాఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది.
భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ లేబుల్‌లో కనిపించని UV హెలిక్స్ లేదా DNA లాంటి నిర్మాణం ఉంది. ఇది UV కాంతి కింద మాత్రమే కనిపిస్తుంది.
భారతదేశంలో ఇప్పటి వరకు 68 కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇందులో 18-44 ఏళ్ల వయసున్న వ్యక్తులకు 26.99 కోట్ల ఫస్ట్ డోస్, మే 1న వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫేజ్-3 ప్రారంభమైనప్పటి నుంచి వారికి 3.35 కోట్ల రెండో డోసులుఇచ్చారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు 60 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్
రష్యా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే రెండు బల్క్ తయారీ సైట్‌లకు వేర్వేరు లేబుల్స్ ఉంటాయి. తయారీదారు పేరు మినహా అన్ని ఇతర సమాచారం, డిజైన్ ఒకే విధంగా ఉంటాయి.
ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న అన్ని ఉత్పత్తుల ప్యాక్ కార్టన్ ముందు, వెనుక మాత్రమే ఇంగ్లీష్ లేబుల్ అందుబాటులో ఉంది. టీకా ఆంపౌల్‌లోని ప్రాథమిక లేబుల్‌తో సహా అన్ని ఇతర వైపులా రష్యన్ లిపిలో ఉంటాయి.