Foreigner Busted: ప్రేమ పేరుతో నాలుగేళ్లుగా మహిళను మోసం చేసి, లక్షల రూపాయలు వసూలు చేసి, పెళ్లికి నిరాకరించిన సౌదీ అరేబియన్ యువకుడిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
సలీంపై 406, 417, 420, 506 సెక్షన్ల కింద సలీంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతణ్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, కోర్ట్ అతడికి రిమాండ్ విధించింది....
Hyderabad, December 26: సౌదీ అరేబియాలోని అల్-రియాద్ ప్రాంతానికి చెందిన అలీ అల్ ఖఫీ సలీం అలియాస్ సలీం అనే 30 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ సమీపంలో గల ఫరా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సలీం, రియాద్- హైదరాబాద్ ప్రయాణాలు చేసే సమయంలో ఇతడికి సౌదీ ఎయిర్‌లైన్స్ (Saudi Airlines) లో సీనియర్ క్యాబిన్ మేనేజర్ (ఎయిర్ హోస్టెస్) గా పనిచేసే దిల్లీకి చెందిన 32 ఏళ్ల యువతితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం స్నేహంగా, ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా సలీం పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ ఆ యువతితో కలిసి తిరగడం, పలుమార్లు ఒకే గదిలో ఉండటం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా యువతి నుంచి చాలా సార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ. 15 లక్షల మొత్తాన్ని తీసుకున్నాడు.
ఆమెతో అన్ని రకాల అవసరాలు తీర్చేసుకున్నాక, ఇప్పుడు ఆ యువతికి మొఖం చాటేసిన సలీం, ఆమె నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. కాగా, డిసెంబర్ 06న రియాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఆమె కంట్లో పడ్డాడు. దీంతో అక్కడిక్కడే పెళ్లి విషయం, డబ్బు విషయంపై సలీంను ఆ యువతి నిలదీయగా, పెళ్లి చేసుకునేది లేదు, ఆ డబ్బు తిరిగిచ్చేది లేదని తేల్చిచెప్పాడు. పెళ్లిలో గట్టిమేళం మోగాల్సిన సమయంలో వరుడి వీపు విమానం మోత మోగింది. మోసగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు
సలీం చేష్టలతో విసుగెత్తిపోయిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో 406, 417, 420, 506 సెక్షన్ల కింద సలీంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతణ్ని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, కోర్ట్ అతడికి రిమాండ్ విధించింది.