Hyderabad Biodiversity Flyover: బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ను మళ్లీ తెరిచారు, 43 రోజుల తర్వాత వంతెనపై రాకపోకలు ప్రారంభం, నిపుణుల కమిటీ సూచన మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్న మేయర్ బొంతు రామ్మోహన్, బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ను పరిశీలించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
నవంబర్ 23.2019న ఫ్లైఓవర్ పై కారు యాక్సిడెంట్ జరినగప్పటి నుంచి ఫ్లైఓవర్ ను మూసివేసిన సంగతి విదితమే. తర్వాత ఫ్లైఓవర్ స్పీడ్ కంట్రోల్ కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. కమిటీ సూచనల మేరకు జీహెచ్ఎంసీ చేపట్టిన పనులను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఫ్లైఓవర్‌ను(Cyberabad police commissioner VC Sajjanar) తిరిగి ప్రారంభించారు.
Hyderabad, January 04: హైదరాబాద్‌లోని బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ను (Hyderabad Biodiversity flyover) జీహెచ్ఎంసీ అధికారులు ((GHMC) రీ ఓపెన్ చేశారు. నవంబర్ 23.2019న ఫ్లైఓవర్ పై కారు యాక్సిడెంట్ జరినగప్పటి నుంచి ఫ్లైఓవర్ ను మూసివేసిన సంగతి విదితమే. తర్వాత ఫ్లైఓవర్ స్పీడ్ కంట్రోల్ కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది. కమిటీ సూచనల మేరకు జీహెచ్ఎంసీ చేపట్టిన పనులను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఫ్లైఓవర్‌ను(Cyberabad police commissioner VC Sajjanar) తిరిగి ప్రారంభించారు.
ఎట్టకేలకు 43 రోజుల తర్వాత ఈ బయోడైవర్సిటీ పైవంతెనపై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. వంతెనను పరిశీలించిన మేయర్ బొంతు రామ్మోహన్ (Mayor Bonthu Rammohan)మీడియాతో మాట్లాడుతూ.. పైవంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత 43 రోజులపాటు దీనిని మూసివేశామని, ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ ఫ్లైఓవర్ పై వాహనదారులు 40 కి.మీ స్పీడ్ కు మించి వెళ్లకూడదన్నారు. ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్స్, కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫ్లైఓవర్ పై సెల్పీలు తీసుకోకుండా సైడ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే జరిమానా విధిస్తామని తెలిపారు. కొన్ని రోజుల పాటు వాహనదారుల కదలికలను, ఫ్లైఓవర్ ను పరిశీలిస్తామన్నారు.
బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్‌ను మొదట గత ఏడాది నవంబర్ 4 న మంత్రులు కేటీఆర్, సబితా ప్రారంభించారు. తర్వాత గత నెల 23వ తేదీన వంతెనపై ఓ కారు అదుపు తప్పి పైనుంచి కింద పడిన ఘటనలో సత్యవేణి(56) అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. డ్రైవరు సహా మరో ముగ్గురు గాయపడ్డారు. నాటి నుంచి వంతెనను మూసివేశారు.
ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్‌పై ప్రమాదాలకు కారణాలు, నివారణ చర్యల అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ వంతెనను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది.గంటకు 40 కిలోమీటర్ల వేగతంతో వెళితే ఇబ్బందేమి లేదని.. అంతకు మించిన వేగంతో వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సూచించింది.