Independence Day 2024: ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, 11వ సారి జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని మోడీ, 2047 వికసిత్ భారత్ లక్ష్యమన్న ప్రధాని,ఎర్రకోటపై హెలికాప్టర్లతో పూలవర్షం
ఎర్రకోటపై 11వ సారి జాతీయ జెండాను ఎగరవేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అనంతరం జాతాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ.
Delhi, Aug 15: ఢిల్లీలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎర్రకోటపై 11వ సారి జాతీయ జెండాను ఎగరవేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అనంతరం జాతాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ.
భారత్ ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శం అన్నారు. ఇవాళ దేశ ప్రజలందరికి శుభప్రదమైన రోజు అన్నారు.దేశం కోసం పోరాడిన నాయకులను స్మరించుకుందాం అన్నారు. హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అడుగులు పడుతున్నాయన్నారు. 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధిస్తే 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానీయులకు దేశం ఎప్పటికి రుణపడి ఉంటుందన్నారు.
Here's Video:
కొన్నేళ్లుగా దేశాన్ని ప్రకృతి విపత్తులు ఇబ్బందులు పెడుతున్నాయని, విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత్ ను ప్రపంచానికే నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు ప్రధాని. దళితులు,పీడితులు,ఆదివాసీలు గౌరవంతో బ్రతకాలన్నారు.
Here's Tweet:
దేశాభివృద్ధికి సంస్కరణలు ఎంతో అవసరం అన్నారు. ప్రపంచానికే అన్నం పెట్టే శక్తిగా భారత్ ఎదగాలన్నారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు. అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ కల నెరవేరాలన్నారు. తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దాలన్నారు మోడీ. మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే...ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండిలా..
Here's Video:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు 6 వేల మందికి ఆహ్వానం అందించగా పారిస్ ఒలంపిక్స్ క్రీడాకారులకు ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. అంతకముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు మోడీ.ఎర్రకోటపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.
Here's Video: