Coronavirus in India: మే నెల నాటికే 64 లక్షల మందికి కరోనా, సెరో సర్వేలో విస్తుగొలిపే నిజాలు, దేశంలో 46,59,984కు చేరుకున్న కోవిడ్ కేసుల సంఖ్య, తాజాగా 97,570 మందికి కరోనా
దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984కు (COVID19 India) చేరింది. నిన్న ఒక్కరోజే 1201 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 77,472 కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి కోలుకుని 81,533 డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 36,24,196 కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,58,316గా ఉంది.
New Delhi, September 12: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 97,570 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (Coronavirus Outbreak in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984కు (COVID19 India) చేరింది. నిన్న ఒక్కరోజే 1201 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 77,472 కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి కోలుకుని 81,533 డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 36,24,196 కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,58,316గా ఉంది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.56 శాతం ఉన్నాయి. మరణాల రేటు 1.66 శాతానికి తగ్గింది.శుక్రవారం ఒకే రోజు 10,91,251 కరోనా టెస్టు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు 5,51,89,226 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.
ఇదిలా ఉంటే దేశంలో మే నెల నాటికే దేశంలో దాదాపు 64లక్షల మందికి కరోనా (Coronavirus Pandemic) వచ్చిందని ఐసీఎంఆర్ సంచలన ప్రకటన చేసింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా మే 11నుంచి జూన్ 4వరకు నిర్వహించిన సెరో సర్వేలో కొన్ని లక్షల మందికి కరోనా వచ్చినట్టుగానీ.. పోయినట్టుగానీ తెలియదని ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా సోకినవారి శరీరంలో వైరస్‌పై పోరాడేందుకు యాంటీ బాడీలు అభివృద్ధి చెందుతాయి. అవి ఎంతమందిలో ఉన్నాయో తెలుసుకోవడం కోసం సెరో సర్వే చేసింది. ఈ సర్వే ద్వారా.. కరోనాపై పోరాడి గెలిచిన వ్యక్తులు ఎంతమంది అన్నదానిపై ఒక అంచనా వస్తుంది.
దేశంలోని 21 రాష్ర్టాల్లో మే 11 నుంచి జూన్ 4 వరకు సర్వే జరిపారు. దాదాపు 28 వేల మంది రక్త నమూనాలను సేకరించి యంటీబాడీ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల ఆధారంగా దాదాపు 64,68,388 మందికి అప్పటికే కరోనా వైరస్ సోకి తగ్గిపోయిందని అంచనాకు వచ్చారు. అంటే దేశంలో పిల్లలను మినహాయిస్తే పెద్దవాళ్లలో 0.73శాతం మందికి మే నాటికే కరోనా సోకి తగ్గింది. సర్వే జరిపే నాటికే దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు వైరస్ విస్తరించింది.
దేశ జనాభాలో కరోనా బారిన పడినవారు ఒకశాతానికి మించకపోయినా ఇప్పటికీ చాలామంది ప్రమాదపుటంచుల్లోనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుతం కరోనా వైరస్ ప్రమాదాన్ని అధికంగా ఎదుర్కోనున్నాయి. ఈ సర్వే ద్వారా కరోనా సోకి దాని నుంచి బయటపడినట్లుగా గుర్తించిన వారిలో 69.4శాతం మంది గ్రామాల్లోనే ఉన్నారు. పట్టణ మురికివాడల్లో 15.9, మురికివాడలు కాని ప్రాంతాల్లో 14.6 శాతం మందిలో యాంటీ బాడీలు గుర్తించారు. కరోనా బారిన పడి దాని నుంచి బయటపడినవారిలో అత్యధికులు 18-45 ఏండ్ల మధ్యవయస్కులే (43.3 శాతం). 46 నుంచి 60 ఏండ్ల వయసువారు 39.5 శాతం, 60 ఏండ్లు పైబడినవారు 17.2శాతం మంది ఉన్నారు.