Heat Waves in India: షాకింగ్ రిపోర్ట్, రానున్న కాలంలో భారత్‌లో వేల మరణాలు, సంచలన నివేదికను బయటపెట్టిన ప్రపంచ బ్యాంక్, వడగాడ్పులు, వేడి వాతావరణంతో ప్రజలు అల్లాడిపోతారని నివేదికలో వెల్లడి
రానున్న కొన్ని దశాబ్దాల్లో భారత దేశంలో తీవ్రమైన వడగాడ్పులు, వేడి వాతావరణంతో (India to soon suffer Extreme heatwaves) ప్రజల ఆయుర్దాయం క్రమంగా (break human survivability limit) తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక (World Bank report) తెలిపింది.దీంతో పాటు వేల మరణాలకు ఇది కారణం కానున్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది.
Mumbai, Dec 8: రానున్న కొన్ని దశాబ్దాల్లో భారత దేశంలో తీవ్రమైన వడగాడ్పులు, వేడి వాతావరణంతో (India to soon suffer Extreme heatwaves) ప్రజల ఆయుర్దాయం క్రమంగా (break human survivability limit) తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక (World Bank report) తెలిపింది.దీంతో పాటు వేల మరణాలకు ఇది కారణం కానున్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక హెచ్చరించింది. వేడి గాలుల కారణంగా మనిషి మనుగడ కాలం తగ్గిపోవడంలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరుతుందని ఆందోళన వ్యక్తంచేసింది.
భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు అన్న పేరుతో ప్రపంచ బ్యాంకు ఈ నివేదిక రూపొందించింది. ‘వాతావరణం, ప్రగతి భాగస్వాముల సమ్మేళనం’ పేరిట రెండు రోజుల పాటు తిరువనంతపురంలో జరగనున్న సదస్సులో ప్రపంచ బ్యాంక్ ఈ నివేదిక విడుదల చేయనుంది. ఈ నివేదికలో పలు ఇతర సంస్థల అధ్యయనంలోని పరిశీలనాంశాలను ప్రస్తావించింది.
2022 ఏప్రిల్‌లో ముందస్తు వేసవి గాలులు జనజీవితాన్ని స్తంభింపజేశాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు పెరిగిందని తెలిపింది. 2021 ఆగస్టులో వాతావరణ మార్పులపై ఐపీసీసీ రూపొందించిన ఆరో అంచనా నివేదిక తదుపరి దశాబ్దాల్లో భారత ఉపఖండం తరచూ ఊష్ణగాలులతో సతమతం కానుందని హెచ్చరించింది.
దేశంలో కర్బన ఉద్గారాలు ఇదే రీతిలో వెలువడితే 2036-65 నాటికి భారత్‌లో వడగాడ్పులు 25 రెట్లు తీవ్రతరం కానున్నాయని 2021లో జీ-20 శీతోష్ణస్థితుల మార్పు నివేదిక పేర్కొంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడనుందని తెలిపింది.దేశ శ్రామికవర్గంలో 75 శాతం అంటే సుమారు 38 కోట్ల మంది ప్రాణహాని పొంచి ఉన్న వేడి ప్రభావానికి లోనయ్యే చోటే పనిచేస్తున్నారు.
దీంతో పాటుగా వేడి తీవ్రత వల్ల పరిశ్రమల్లో ఉత్పాదకత పడిపోయి ఉద్యోగాల్లో కోతలు అనివార్యం కానున్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనుండగా, ఆ సంఖ్య భారత్‌లోనే 3.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. శ్రామికశక్తి తగ్గుదలతో ఈ దశాబ్దం చివరి నాటికి దేశ జీడీపీలో 4.5శాతం ప్రమాదంలో పడనుందని ప్రముఖ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెక్‌కెన్సీ అండ్ కంపెనీ నివేదించింది.
ప్రపంచంలో టీకాల తయారీలో మూడో స్థానంలో ఉన్న ఇండియా సరైన శీతలీకరణ చర్యలపై దృష్టి పెట్టలేదని నివేదిక తెలిపింది. ఫలితంగా సరఫరా గొలుసుల్లో శీతలీకరణ దశలు లోపించి 20 శాతం మందులు, 25 శాతం టీకాలు వృథా అయ్యాయని పేర్కొంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)