Indian Army Chopper Crash: జమ్ముకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ చీతా హెలికాప్టర్, పైలట్, కో పైలట్ పారాచూట్ ద్వారా బయటపడినట్లు వార్తలు, వారిని గాలిస్తున్న ఆర్మీ రెస్క్యూ బృందాలు
ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం (Indian Army Chopper Crash) జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం (Army’s Cheetah Helicopter Crashes) జరిగింది.
New Delhi, March 11: ఆర్మీకి చెందిన హెలికాప్టర్ జమ్ముకశ్మీర్‌లో కూలి పోయింది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం (Indian Army Chopper Crash) జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో శుక్రవారం ఈ ప్రమాదం (Army’s Cheetah Helicopter Crashes) జరిగింది. గురెజ్ ప్రాంతంలో గాయపడిన ఓ సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన చీతా హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక వెనుదిరిగింది. ఆ తర్వాత కాసేపటికే ఎల్ఓసీ వద్ద ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయింది.
గురేజ్ సెక్టార్‌లో మంచుతో నిండిన బరౌమ్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చీతక్ హెలికాప్టర్ కూలిందని ఆర్మీ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సంఘటనా ప్రాంతానికి వెళ్లాయని చెప్పారు. కాగా, ఆర్మీ హెలికాప్టర్ కూలడానికి ముందు పైలట్, కో పైలట్ పారాచూట్ ద్వారా బయటపడినట్లు తెలుస్తున్నది. అయితే మంచుతో కూడిన పర్వతాల్లో వారు ఎక్కడ దిగారో అన్నది తెలియలేదు. మరోవైపు పైలట్, కో పైలట్ కోసం ఆర్మీ రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. అయితే వారు సురక్షితంగా ఉన్నారో లేదో అన్నది తెలియలేదు.
ఈ నేపథ్యంలో కూలిన ఆర్మీ హెలికాప్టర్ సిబ్బంది క్షేమం గురించి అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. సైన్యంలో ఎన్నో సంవత్సరాలు సేవలు అందిస్తున్న చీతా, చేతక్ హెలికాప్టర్లను మార్చి కొత్త హెలికాప్టర్లతో భర్తీ చేయాలంటూ గతంలో ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వీటిని నావల్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్ యూహెచ్), రష్యా తయారీ కేఏ 226టీ హెలికాప్టర్లతో భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.