Fly Found Inside Man's Intestines: వృద్ధుడి పెద్దపేగులోకి చేరిన ఈగ, లోపలికి వెళ్లిందో తెలియక బుర్రలు బద్దలుగొట్టుకుంటున్న వైద్యలు

కొలొనోస్కోపీ కోసం ఆసుపత్రికి 63 ఏళ్ల వృద్దుడు రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లాడు. రెగ్యులర్ చెకప్ లో కొలనోస్కోపీ ద్వారా వృద్దుడికి వైద్య పరీక్షలు చేసారు.

fly (photo-x)

అమెరికా నవంబర్24: అమెరికాలోని మిస్సౌరీలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కొలొనోస్కోపీ కోసం ఆసుపత్రికి 63 ఏళ్ల వృద్దుడు రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లాడు. రెగ్యులర్ చెకప్ లో కొలనోస్కోపీ ద్వారా వృద్దుడికి వైద్య పరీక్షలు చేసారు. కొలనోస్కోపీ ప్రక్రియ ద్వారా ఓ ప్లెక్సిబుల్ ట్యూబ్ కు కెమెరా, లైట్ అమర్చి పెద్దపేగులోకి పంపించి పరీక్ష చేస్తున్న సందర్భంలో అతని పెద్దపేగులో ఓ చోట చనిపోయిన ఈగ కనిపించడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం గురించి వృద్దుడికి చెప్పడంతో షాకయ్యాడు. వైద్యులు తెలిపినట్లుగా కొలొనోస్కోపీ చేసే ముందు తను ద్రవహారం మాత్రమే తీసుకున్నానని.. భోజనంలో మాత్రం పిజ్జా, పాలకూర తిన్నానని చెప్పాడు. అనుకోకుండా ఆ ఈగను ఎలా మింగానో గుర్తులేదు అని చెప్పుకొచ్చాడు

ఆ ఈగ అతడి పేగులోకి ఎలా వెళ్లిందన్న దానిపై మిస్సౌరీ విశ్వవిద్యాలయ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ చీఫ్ మాథ్యూ బెచ్ టోల్డ్ వాళ్లు రెండు సిద్దాంతాలను కనిపెట్టారు. ఈగ మనిషి నోటి ద్వారా పెద్ద ప్రేగులకు ఎలా చేరుకొని ఉంటుందనే దానిపై వివరణ ఇస్తూ. . సాధారణ పరిస్థితుల్లో అయితే ఎగువ జీర్ణ ఎంజైములు పొట్టలోని ఆమ్ల ఈగని జీర్ణం చేసుకొని ఉండాలి. కానీ అలా జరగలేదు. కనుక నోటి ద్వారా మాత్రం ఈగ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు.

వీడియో ఇదిగో, ఈ పాపులారిటీ పిచ్చితో ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్లకు శోకమే, సెక్రటరియేట్ వద్ద యువకుడు ప్రమాదకర విన్యాసాలు, మండిపడుతున్న నెటిజన్లు

అదే విధంగా రెండో సిద్దాంతం ప్రకారంగా .. పురీషనాళం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చివరగా ఈ సిద్దాంతం కూడా తప్పేనని తెలిసింది. దిగువ భాగం నుంచి పెద్దపేగులోకి ఈగ చొచ్చుకొనిపోవడం అనేది అసాధ్యం అని తెలుసు. ఎందుకంటే ఈగ లోపల ఉన్నా పెద్దపేగులోకి వెళ్లాలంటే ఆ నాళం పొడవుగా తెరుచుకొని ఉండాలి. కానీ పెద్దపేగు మాత్రం మధ్యలో ముడుచుకొని వంకరగా ఉంటుంది. కనుక ఈ సిద్దాంతం కూడా తప్పే అని నిర్దారణ అయ్యింది.

జీర్ణవ్యవస్థలో కీటకాలు చెక్కుచెదరకుండా ఉండి గుడ్లు లేదంటే లార్వాలను జీర్ణాశయాంతర పేగులలో ఉంచి పేగు మయాసిస్ కు కారణమయ్యే సందర్బాలు గతంలోను అరుదుగా చోటు చేసుకున్నాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేర్కొంది. పిన్‌వార్మ్, సీట్‌వార్మ్, థ్రెడ్‌వార్మ్ వంటి పరాన్న జీవులు పేగులను ప్రభావితం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నప్పటికీ పేగుల్లో జీర్ణం కాని ఈగను గుర్తించడం ఇదే మొదటిసారి. ఈగ మనిషి పెద్దపేగులోకి ఎలా ప్రవేశించి ఉంటుదని.. ఆ ఈగ కోసం చేసిన సిద్దాంతాలన్నీ తప్పు కావడంతో మరి అది ఎలా ప్రవేశించిందన్నది శాస్త్రవేత్తలకు పెద్ద మిస్టరీగా మారింది

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif