ITR Filing For 2019-20: డిసెంబర్ 31 చివరి తేదీ, వెంటనే ఐటీఆర్ ఫైల్ చేయండి, లేదంటే రూ. 5 వేల వరకు పెనాల్టీ, 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం

లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ (Income Tax Returns Filing) చేస్తే కనీసం రూ.5,000 వరకు ఆదాయపు పన్ను శాఖ పెనాల్టీ వసూలు చేయనుంది. ఈ ఫైన్ రూ.10,000 వరకు ఉండే అవకాశం ఉంది.

Income Tax Filing (Photo Credits: Pixabay)

Mumbai, December 7: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ (ITR Filing For 2019-20) చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించారు. కాగా ఆదాయపు పన్ను శాఖ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పలుమార్లు చివరి తేదీని పొడిగించింది. అయితే ఈ సారి తేదీని పొడిగించే అవకాశాలు కనపడటం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 లోగా తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తర్వాత ఐటీఆర్ ఫైల్ (Income Tax Returns Filing) చేస్తే కనీసం రూ.5,000 వరకు ఆదాయపు పన్ను శాఖ పెనాల్టీ వసూలు చేయనుంది. ఈ ఫైన్ రూ.10,000 వరకు ఉండే అవకాశం ఉంది.

మీరు నేరుగా ఆదాయపు పన్ను శాఖకు చెందిన https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్‌లో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత వేర్వేరు ఫామ్స్ ఉంటాయి. వేతనజీవులు, పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, వడ్డీ ద్వారా ఆదాయం పొందుతున్న వారు ITR-1, క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఆదాయం పొందుతున్న వారు ITR-2, ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్లు ITR-3, ITR-4, ITR-4S ఫామ్స్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమయిన విపక్షాలు, డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు పూర్తి మద్ధతు, బీజేపీ పార్టీని ఢీ కొట్టేందుకు కేసీఆర్ నయా వ్యూహం

ఐటీఆర్ ఫైలింగ్ మొదలు పెట్టే ముందు అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకోవాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫామ్ 16, మీ పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లాంటివి సిద్ధం చేసుకోవాలి. అవసరమైన చోట అప్‌లోడ్ చేయాలి. చివరగా చెల్లించాల్సిన పన్ను ఏదైనా ఉంటే ట్యాక్స్ డ్యూ చెల్లించి సబ్మిట్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత వివరాలన్నీ ఓసారి సరిచూసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిట్ చేయాలి. ఆదాయపు పన్ను శాఖ సూచించిన చివరి తేదీ లోగా తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేకపోతే రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ రూ.25 లక్షల కన్నా ఎక్కువ పన్ను ఎగవేసినట్టు తేలితే 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.