Theatres in Kashmir: కశ్మీర్‌లో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు.. ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్
ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో మూతబడిన హాళ్లు.. కశ్మీర్‌లో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్లు.. ప్రారంభించిన లెఫ్టినెంట్ గవర్నర్.. వచ్చే వారం తొలి ఐనాక్స్ థియేటర్ ప్రారంభం
Srinagar, September 19: ఉగ్రవాదం (Terrorisim) కారణంగా జమ్మూకశ్మీర్‌లో (Jammu-Kashmir) దాదాపు మూడు దశాబ్దాల క్రితం (Three Decades Back) మూతబడిన సినిమా థియేటర్లు (Movie Theatres) మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలో ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మల్టీ పర్పస్ సినిమా హాళ్లను ప్రారంభించి సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో జమ్మూలోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
జమ్మూకశ్మీర్‌లో త్వరలో మరిన్ని థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే వారం తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. 520 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో ఉంది. ఇందులో మూడు స్క్రీన్లు ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో 1980 వరకు సినిమా థియేటర్లు ఉండేవి. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదం పెచ్చుమీరడంతో 1990 దశకంలో సినిమా హాళ్లన్నీ మూతపడ్డాయి.