Jammu And Kashmir: పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకం, పోలీసు అధికారి కుటుంబంపై విచక్షణా రహితంగా కాల్పులు, మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌ ఫయాజ్‌ అహ్మద్‌ దంపతులు మృతి

మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌ (ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంట్లోకి చొర‌బ‌డిన టెర్రరిస్టులు ఆయ‌న‌ను హ‌త్య చేశారు.

Representational image (Photo credits: ANI)

Pulwama, June 28: జమ్ముక‌శ్మీర్‌లోని పుల్వామాలో ( Pulwama) ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌ (ఎస్పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ ఇంట్లోకి చొర‌బ‌డిన టెర్రరిస్టులు ఆయ‌న‌ను హ‌త్య చేశారు. కశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన మాజీ ఎస్పీఓ ఫయాజ్‌ అహ్మద్‌ పుల్వామా జిల్లాలోని అవంతీపొర సమీపంలోని హరిపరిగ్రామ్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో అహ్మద్ (Special Police Officer Fayaz Ahmad) అక్కడికక్కడే మృతిచెందారు.

ఆయన భార్య రజా బేగమ్‌, కుమార్తె రఫియా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజా బేగం మృతిచెందారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. అహ్మద్ కుమార్తె దవాఖానలో చికిత్స పొందుతున్నదని వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.

దేశంలో భారీగా తగ్గిన కేసులు, పెరిగిన రికవరీలు, గత 24 గంటల్లో 46,148 మందికి కరోనా, 58,578 కోలుకుని క్షేమంగా ఇంటికి, క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో అమెరికాను దాటిపోయిన భారత్

పోలీసుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలో ఉన్న ఫయాజ్‌ నివాసంలోకి ఉగ్రవాదులు ఆదివారం చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వారందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే స్థానికులు, బంధువులు.. ఫయాజ్‌ సహా ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భార్య చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుమార్తె మాత్రం మృత్యువు నుంచి బయటపడ్డప్పటికీ.. తీవ్రమైన బుల్లెట్‌ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కలిసి ఫయాజ్‌ దంపతుల అంత్యక్రియలు పూర్తిచేశారు. కుమారుడు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. గతంలో ఆయనకు కూడా అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. అయినా సైన్యం నుంచి వైదొలగకుండా.. దేశ సేవలోనే కొనసాగుతుండడం గమనార్హం.