Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన
ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....
Hyderabad, April 16: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో పాదయాత్ర, బహిరంగ సభ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయనకు స్వల్ప అస్వస్థత అనిపించడంతో హైదరాబాద్ లోని తన ఫామ్ హౌజ్‌లో స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో కరోనా పరీక్షలు చేసుకోగా అయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
'పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తులలో కొంత ఫ్లమ్ చేరింది స్వల్ప జ్వరం కూడా ఉంది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది' అని పవన్ పొలిటికల్ సెక్రటరీ పి.హరిప్రసాద్ శుక్రవారం చెప్పారు ఒక ప్రకటనలో తెలిపారు.
పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడటంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కలవరపడుతోంది. ఆయన ఆరోగ్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది, అపోలోకు చెందిన ప్రత్యేక వైద్య బృందం కూడా పవన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది.
Update From Janasena Party:
మరోవైపు పవన్ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే తన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు.