IPL Auction 2025 Live

Karnataka Shocker: ఇంత దారుణమా.. రేప్‌కు సహకరించలేదని మ‌హిళ‌పై పెట్రోల్ పోసి స‌జీవ ద‌హ‌నం చేసిన కామాంధుడు, క‌ర్నాట‌క‌లోని యాద్గిర్ జిల్లాలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తాజాగా కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్ర‌తిఘ‌టించిన మ‌హిళ‌ను (Woman burnt alive after she resists rape attempt) ఓ వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని యాద్గిర్ జిల్లాలో ( rape attempt in Yadgir) వెలుగుచూసింది.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Yadgir, Oct 5: దేశంలో నేరాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. తాజాగా కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్ర‌తిఘ‌టించిన మ‌హిళ‌ను (Woman burnt alive after she resists rape attempt) ఓ వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లోని యాద్గిర్ జిల్లాలో ( rape attempt in Yadgir) వెలుగుచూసింది. స‌ర్పూర్ తాలూకాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని గంగ‌ప్ప బ‌స‌ప్ప‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం నిందితుడు సోమ‌వారం తెల్ల‌వారుజామున వివాహిత‌ ఇంట్లో చొర‌బ‌డి ఆమెపై లైంగిక దాడికి ప్ర‌య‌త్నించాడు.

మ‌హిళ ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 95 శాతం కాలిన గాయాలైన బాధితురాలిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. త‌న కోరిక‌ను తీర్చేందుకు మ‌హిళ నిరాక‌రించ‌డంతో బైక్‌పై బ‌య‌ట‌కు వెళ్లిన నిందితుడు పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై ఘాతుకానికి తెగ‌బ‌డ్డాడు. బాధితురాలి కుటుంబస‌భ్యుల ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

కానిస్టేబులే కామాంధుడైన వేళ, ఎవరూ లేని సమయంలో వివాహితపై ఇంట్లోకి దూరి అత్యాచార యత్నం, బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు చేసిన దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు

బాధితురాలికి నిందితుడు తెలుసు..అయితే ఇలా తనపై కోరిక పెంచుకోవడంతో ఆమె హెచ్చరించింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా అతడికి బుద్ధిని మార్చుకోమని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతను ఆమె వెంట పడ్డాడు. ఒప్పుకోలేదని ఏకంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనపై కర్ణాటక మంత్రి "అరగా జ్ఞానేంద్ర స్పందించారు. యాదగిరి జిల్లాలోని ఒక గ్రామంలో ఒక దురదృష్టకరమైన మరియు అమానవీయ సంఘటన జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. నిందితుడిని చట్టం ప్రకారం శిక్షిస్తారు. విచారణ జరుగుతున్నందని, విచారణ త్వరగా ముగిస్తారని తెలిపారు.