Minor Suicide Over Pet Fish: అక్వేరియంలోని పెంపుడు చేప చనిపోయిందని బాలుడి సూసైడ్, దిగులుతో ఉరేసుకున్న మైనర్, కేరళలో ఘటన
కేరళలోని మలప్పురం (Malappuram) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొన్నానిలోని ఒక ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల రోషన్ మీనన్ 8వ తరగతి చదువుతున్నాడు. అతడికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. పావురాలతోపాటు ఇంట్లోని అక్వేరియంలో చేపలు పెంచుతున్నాడు
Kochi, FEB 25: అక్వేరియంలో పెంచుతున్న చేప చనిపోయిందన్న (Pet fish’s death) మనస్తాపంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలోని మలప్పురం (Malappuram) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొన్నానిలోని ఒక ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల రోషన్ మీనన్ 8వ తరగతి చదువుతున్నాడు. అతడికి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. పావురాలతోపాటు ఇంట్లోని అక్వేరియంలో చేపలు పెంచుతున్నాడు. అయితే అక్వేరియంలో పెంచుతున్న చేపల్లో ఒకటి ఇటీవల చనిపోయింది. దీంతో రోషన్ తీవ్ర మనస్తాపం చెందాడు. నాటి నుంచి దిగులుగా ఉంటున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం రోషన్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మేడ పైకి ఎక్కి పావురాలకు మేత వేశాడు. చాలా సేపటి వరకు ఇంట్లోకి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆ బాలుడి కోసం అంతా వెతికారు.
రోషన్ ఎక్కడా కనిపించలేదు. చివరకు మేడ పైకి వెళ్లారు. అక్కడున్న షెడ్‌లో ప్లాస్టిక్ తాడుకు వేలాడుతున్న రోషన్‌ను చూసి (Suicide) షాకయ్యారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే రోషన్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పెంపుడు చేప చనిపోయిందన్న మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు రోషన్ తండ్రి రవీంద్రన్ పోలీసులకు తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.