MP Shocker: ఎంపీలో దారుణం, దళిత సోదరులకు గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించిన పంచాయితీ పెద్దలు, కేసు నమోదు చేసిన పోలీసులు

మధ్యప్రదేశ్‌లో అగ్రకులాలకు చెందిన గ్రామ పెత్తందారులు ఇద్దరు దళిత సోదరులకు గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా (Dalit brothers tonsured) ఊరేగించారు

Representational Image | (Photo Credits: IANS)

Bhopal, Oct 21: మధ్యప్రదేశ్‌లో అగ్రకులాలకు చెందిన గ్రామ పెత్తందారులు ఇద్దరు దళిత సోదరులకు గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా (Dalit brothers tonsured) ఊరేగించారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలోని దబోహా గ్రామంలో తాజాగా చోటుచేసుకున్నది. అగ్రకులానికి చెందిన వ్యక్తితో వివాదం పెట్టుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది.

ఓ విషయంపై జరిగిన వివాదంలో అగ్రకులానికి చెందిన దిలీప్‌ శర్మ అనే వ్యక్తితో సంతోష్‌, ధర్మేంద్ర షాక్యా ఇద్దరు సోదరులకు గొడవ జరిగిందని ఎస్పీ శైలేంద్ర సింగ్‌ తెలిపారు. వీరి వివాదాన్ని పరిష్కరించే పేరుతో గ్రామ పెద్దలు పంచాయతీ సమావేశం ఏర్పాటు చేశారు. వాగ్వివాదంలో గాయపడిన దిలీప్‌ శర్మకు రూ.1.54 లక్షలు చెల్లించాలని పంచాయతీ ఆదేశించింది.

మధ్యప్రదేశ్‌లో దారుణం, అంబులెన్స్ లేక చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకుని బస్టాండ్‌కు చేరుకున్న మేనమామ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆ తర్వాత ఇద్దరు దళిత సోదరులకు గుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, ఊరంతా ఊరేగించి ( paraded in Bhind) దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటనపై పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దిలీప్‌ శర్మతో పాటు అతని తండ్రిని అరెస్టు చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement