మధ్యప్రదేశ్‌లో ప్రమాదంలో మరణించిన బాలికను పోస్టుమార్టం నిమిత్తం ఛాతర్‌పూర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పాప మేనమామ మృతదేహాన్ని గ్రామానికి తీసుకుపోయేందుకు వాహనం కోసం ప్రయత్నించగా.. ఆస్పత్రి అంబులెన్స్‌ అందుబాటులో లేదు. ప్రైవేటు వాహన ఖర్చును భరించలేని ఆ వ్యక్తి, చేసేదేంలేక పాప మృతదేహాన్ని భుజాలపై వేసుకొని బస్టాండ్‌కు వెళ్లాడు. అలాగే బస్సు ఎక్కి గ్రామానికి వెళ్లాడు. పాప మృతదేహంతో ఆ మేనమామ రద్దీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)