Mauni Amavasya 2025: వీడియోలు ఇవిగో, మౌనీ అమావాస్య సందర్భంగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, ఈ ఒక్కరోజే ఏకంగా 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేసిన యూపీ సర్కారు

144 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ కుంభమేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

Maha Kumbh Mela 2025 (Photo-ANI)

Prayagraj, Jan 29:  మహా కుంభ మేళా (Maha Kumbh Mela)ప్రయాగ్‌ రాజ్‌ (Prayagraj)లో ఘనంగా కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన ఈ కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. 144 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ కుంభమేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

కుంభమేళాలో నేడు మౌనీ అమావాస్య కావడంతో భక్తులు పోటెత్తారు. దీన్ని మ‌హా కుంభ‌మేళాలో అమావాస్య రోజున నిర్వహించే స్నానం కాబట్టి అత్యంత ప‌విత్రంగా భావిస్తారు.ఈ రోజు ఉదయం 6 గంటల వరకు ఏకంగా 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మౌనీ అమావాస్య సందర్భంగా ఇవాళ ఒక్కరోజే ఏకంగా 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాల కోసం తరలివస్తారని యూపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇందులో భాగంగా ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రక‌టించింది.

Massive crowd continue to gather to take holy dip in Triveni waters on Mauni Amavasya

కుంభమేళా ప్రాంతాన్ని ఏఐ ఆధారిత సీసీ కెమెరాల‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.ఇక మహాకుంభ మేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి జనవరి 28వ తేదీ వరకూ మొత్తం 19.94 కోట్ల మంది ప్రజలు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడించింది. ను పురస్కరించుకొని జ‌న‌వ‌రి 28, 29, 30 తేదీల్లో ప్రయాగ్‌రాజ్‌లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రక‌టించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement