Maharashtra: దారుణం, టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన డాక్టర్, మరో వైద్యుడిని పిలిచి ఆపరేషన్లు చేయించిన యాజమాన్యం

కప్పు టీ ఇవ్వని కారణంగా ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఓ వైద్యుడు (Nagpur Doctor) మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు ( Leaves Surgery Midway).ఈ ఘటన స్థానిక మౌదా తహసీల్‌ (Mauda tehsil )లోని ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.

Operation (Photo credits: Wikimedia Commons)

Nagpur Doctor Leaves Surgery Midway: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కప్పు టీ ఇవ్వని కారణంగా ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ఓ వైద్యుడు (Nagpur Doctor) మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు ( Leaves Surgery Midway).ఈ ఘటన స్థానిక మౌదా తహసీల్‌ (Mauda tehsil )లోని ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది.

నవంబర్‌ 3వ తేదీన 8 మంది మహిళలు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ (family planning surgery) కోసం వచ్చారు. ఈ క్రమంలో డాక్టర్ తేజ్‌రంగ్‌ భలవి నలుగురు మహిళలకు శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. ఆ తర్వాత మరో నలుగురికి ఆపరేషన్‌ చేసేందుకు ముందు అనస్థీసియా ఇచ్చారు. ఈ క్రమంలో ఆ గ్యాప్‌లో వైద్యుడు ఆసుపత్రి సిబ్బందిని టీ కోరాడు. అయితే, వారు టీ ఎంతసేపటికీ ఇవ్వలేదు (Not Being Served Tea ). దీంతో అసహనానికి గురైన వైద్యుడు.. ఆపరేషన్లు చేయకుండానే అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలకు క్షమాపణలు చెప్పిన బీహార్ సీఎం

ఈ విషయాన్ని వెంటనే జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు అక్కడున్న సిబ్బంది.దీంతో జిల్లా వైద్యాధికారి మిగిలిన నలుగురు మహిళలకు శస్త్రచికిత్స చేసేందుకు మరో వైద్యుడిని పంపారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది.నాగ్‌పూర్‌ జిల్లా పరిషత్‌ సీఈవో సౌమ్య శర్మ మాట్లాడుతూ.. ఈ కేసు దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif