Maharashtra Elections 2024: ఆరు నూరైనా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రశ్నే లేదు, మహా ఎన్నికల్లో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు.
Mumbai, Nov 8: రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొనడంపై ప్రధాని మోదీ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. దూల్‌లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ..ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆర్టికల్ 370(Article 370)ని పునరుద్దరించలేదన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి సర్కారు పాకిస్థాన్ ఎజెండాతో పనిచేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇక సాంగ్లీలో జరిగిన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇదే విషయంపై కుండబద్దలు కొట్టారు. మీకో విషయం చెబుతున్నానని, ఆర్టికల్ 370ని కశ్మీర్‌లో పునరుద్దణ జరగదన్నారు.ఆర్టికల్ 370పై మాట్లాడుతూ.. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేయడం అతి పెద్ద నిర్ణయం అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడగానే, కశ్మీర్‌పై కాంగ్రెస్ కుట్రకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఆర్టికల్ 370 అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినట్లు చెప్పారు.కానీ ఆ ఆర్టికల్ పునరుద్దరణ ఎన్నటికీ జరగదన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు, ఏదీ మారదన్నారు.