Maharashtra Shocker: 11 ఏళ్ళ బాలిక జీవితాన్ని చిదిమేసిన ఫేస్‌బుక్ మోజు, రెండేళ్లపాటు బంధించి దారుణంగా అత్యాచారం చేసిన స్నేహితుడు

మహారాష్ట్రలోని లాతూర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.

Rape (Representative Photo | Photo Credit: Pixabay)

Mumbai, June 1: ఫేస్‌బుక్‌లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించి సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 11 ఏళ్ల బాలికకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిపి ఉత్తర్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చేలా సదరు బాలికను నిందితుడైన వ్యక్తి ప్రేరేపించాడు.

శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను హత్య చేసిన భర్త, అలిసిపోయానని భార్య చెప్పినా వినకుండా సెక్స్ కోసం బలవంతం, నిందితుడు అరెస్ట్

ఈ క్రమంలో సదరు బాలిక డిసెంబర్ 24, 2021వ తేదీన మహరాష్ట్ర లాతూర్‌లోని ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురే బాలికను ఉత్తర్ ప్రదేశ్ నుంచి లాతూర్ తీసుకెళ్లాడు. గత రెండేళ్ల నుంచి బాలికను నిర్భందించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కుటుంబ సభ్యులు గదిలో వెతుకుతుండగా.. రెండు నెంబర్లు దొరికాయి.

వావి వరసలు మరిచి అన్న భార్యతో అక్రమ సంబంధం, మూడేళ్ల పాటు అదే పని, ఆమె నుంచి పెళ్ళి ఒత్తిడి రావడంతో చంపేసిన కసాయి

ఇందులో ఒక నెంబర్ కు ఫోన్ చేయగా.. నిందితుడు తనను తాను హైదరాబాద్ కు చెందిన షేక్ గా పరిచయం చేసుకుని, 11 ఏళ్ల అమ్మాయి తన వద్దే ఉందని, ఆమె ఇంటికి తిరిగిరాదని ఆమె కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. ఆమె గురించి మరిచిపోవాలని సలహా ఇచ్చాడు. అయితే సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మొబైల్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి నిందితుడు మనుద్దీన్ బాదురేని లాతూర్ లో అరెస్ట్ చేశారు.

అతని వద్ద బందీగా ఉన్న బాలికను రక్షించారు. లాతూర్ బందీ ఉంచడానికి ముందు మనుద్దీన్ గోరఖ్ పూర్ లో నివిసించేవాడని పోలీసులు వెల్లడించారు. యూపీ పోలీసులు అరెస్ట్ చేసి అతనిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.