Maharashtra Shocker: తాగుడుకు బానిసైన భార్య, మానకపోవడంతో ఆమెను గొడ్డలితో నరికి చంపేసిన భర్త, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన, ముంబైలో మందు పోయలేదని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన మరో ఇద్దరు వ్యక్తులు
ఆమె భర్తను హంతకుడిని మార్చివేసింది. తాగుడుకు బానిసగా మారిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో ( Tribal man axes wife) నరికిచంపాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో (Palghar) ఈ దారుణం జరిగింది.
Mumbai, Sep 18: మహారాష్ట్రలో ఓ మహిళ మద్యం అలవాటు ఏకంగా ఆమె ప్రాణం తీసింది. ఆమె భర్తను హంతకుడిని మార్చివేసింది. తాగుడుకు బానిసగా మారిందన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో ( Tribal man axes wife) నరికిచంపాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో (Palghar) ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ జిల్లా రన్‌సేత్ బోయిర్ పాదా గ్రామానికి చెందిన సందీప్ గంగ్యా మోరే (46), వనిత (40) ఇద్దరూ భార్యాభర్తలు.
వనిత మద్యానికి బానిసగా (addiction) మారడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అదే క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కూడా సందీప్ గంగ్యా మోరే బయటి నుంచి వచ్చేసరికి వనిత ఫుల్‌గా మద్యం సేవించి ఉంది. అది చూసి సందీప్ ఆగ్రహానికి లోనయ్యారు. తన చేతిలో ఉన్న గొడ్డలితో భార్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వనిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో థానే ప్రాంతంలోని కళ్యాణ్ ఏరియాలో దారుణం జరిగింది. తమకు మద్యం పోయలేదన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణ్ ఏరియాకు చెందిన అజయ్ జల్లె రావత్ (24) ఇటీవల స్థానిక మద్యం దుకాణంలో మద్యం తాగుతుండగా సునీల్ గణేష్ చౌదరి (27), లూటో కట్కుల్ మహాలహర్ (26) అనే ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వెళ్లారు. తమకు కూడా మద్యం పోయాలని అడిగారు. అయితే, వారికి మద్యం పోసేందుకు అజయ్ జల్లె రావత్ నిరాకరించారు.
దాంతో ఆగ్రహించిన ఆ ఇద్దరూ అతడిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం బాధితుడు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండటాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. అతడి వాంగ్మూలం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.