Ahmedabad: రాత్రి నేను రూంలోకి వెళితే..నా భర్త బయటకు పరిగెత్తుతున్నాడు, ఆ విషయం గురించి అడిగితే కోపంతో చితకబాదుతున్నాడు, భర్తతో పాటు అత్త మామలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Ahmedabad, Sep 17: గుజరాత్ రాష్ట్రంలో ఓ భర్త దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. త‌న‌తో సంసారం చేయ‌కుండా భ‌ర్త తీవ్ర వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఘటన రాష్ట్రంలోని అహ్మ‌దాబాద్‌లో వెలుగుచూసింది. పెళ్లయిన పది రోజులు బాగానే ఉన్నాడు.. ఆ తర్వాత భర్తలో అనూహ్య మార్పులు. అత్తింటికి వెళ్లిన అమ్మాయికి పక్షం రోజుల్లోనే నరకం కనపడింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తామామ కూడా వేధింపులకు పాల్పడుతున్నారు.

అవన్నీ పక్కన పెట్టేసి సర్దుకుపోదామని భార్య కలుద్దామని వెళ్తే (Man stops having sex with wife) భర్త చీత్కరిస్తున్నాడు. బెడ్రూమ్‌లో కూడా సక్రమంగా ఉండడం లేడు. మరోసారి అడగ్గా అతడు భార్యను ( thrashes her when she makes advances) చితకబాదాడు. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో త‌న‌ను పుట్టింట్లో వ‌దిలివేశాడ‌ని బాధితురాలు పోలీసులకు పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అహ్మదాబాద్‌కు చెందిన యువతికి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 27న వివాహం కాగా అప్ప‌టి నుంచి భ‌ర్త, అత్తింటి వారు క‌ట్నం త‌గినంత తీసుకురాలేద‌ని వేధిస్తుండే వారు. భ‌ర్త త‌న‌తో ప‌ది రోజుల పాటు సంసారం స‌జావుగానే చేయ‌గా, ఆపై త‌న‌కు దూరంగా ఉండేవాడ‌ని, తాను శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ప్ర‌య‌త్నించిన ప్ర‌తిసారీ త‌నపై దాడి చేసి వేధించేవాడ‌ని మ‌హిళ వాపోయారు. వాటిని భరిస్తూ భర్తతోనే ఉండాలని భావించిన ఆ మహిళ బెడ్రూమ్‌లోనైనా సక్రమంగా ఉంటాడంటే అదీ లేదు. కోరి కోరి వస్తే కూడా చీత్కరిస్తున్నాడు. ఆ విషయానికి వచ్చేసరికి కోపంతో దాడి చేస్తున్నాడు. ఇక వద్దని బెడ్రూమ్‌లో వదిలేసి బయటకు వెళ్లేవాడని తెలిపారు.

వీడు మనిషేనా..అవ్వ అందుకు ఒప్పుకోలేదని చంపేసి ఆ శవంతో సెక్ప్ చేశాడు, తాగిన మత్తులో వృద్ధురాలిని చంపి ఆ బాడీతో కామవాంఛను తీర్చుకున్న 19 ఏళ్ళ కుర్రాడు

తాను అందంగా లేన‌ని మ‌రో మ‌హిళ‌తో లైంగిక సంబంధం పెట్టుకుంటాన‌ని బెదిరించేవాడ‌ని తెలిపారు. భ‌ర్త‌, మెట్టినింటి వేధింపుల‌తో విసుగు చెందిన తాను ఆగ‌స్ట్ 1న ఇల్లు విడిచివెళ్ల‌గా పెద్ద‌లు జోక్యం చేసుకుని మ‌రోసారి ఇలాంటివి జ‌ర‌గ‌వ‌ని న‌మ్మ‌బ‌ల‌క‌డంతో తిరిగి భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాన‌ని బాధితురాలు వెల్ల‌డించారు. భ‌ర్త‌, అత్తింటి వారిలో ఎలాంటి మార్పులేద‌ని వారం రోజుల త‌ర్వాత ఆగ‌స్ట్ 8న పుట్టింటి వ‌ద్ద త‌న‌ను భ‌ర్త దింపివెళ్లాడ‌ని వివ‌రించారు. భ‌ర్త‌పై మ‌హిళ ఫిర్యాదుతో నిందితుడు అత‌డి కుటుంబ స‌భ్యుల‌పై గృహ హింస స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.