Mass Suicide In Delhi: ఢిల్లీలో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా.. తండ్రి, నలుగురు కుమార్తెల ఆత్మహత్య
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. బీహార్ నుంచి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Newdelhi, Sep 28: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. బీహార్ (Bihar) నుంచి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వారందరూ విషం తాగి మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గత మూడు రోజుల నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తుందంటూ చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఐదుగురి మృతదేహాలు ఒకదాని పక్కన ఒకటి పడి వున్నాయి.
కొన్నినెలల క్రితం తల్లి..
వసంత్ కుంజ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తండ్రి కార్పెంటర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. పిల్లల తల్లి కొన్నేళ్ల క్రితమే క్యాన్సర్ తో మరణించింది. అయితే, వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.