Mumbai Shocker: భార్యను మార్చుకునే విధానానికి అలవాటుపడిన భర్త, తన భార్యపై అత్యాచారం చేసేందుకు స్నేహితులకు అనుమతి, ఆపై వీడియో చిత్రీకరణ, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఆ సమయంలో నా భర్త స్నేహితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించగా, వెనక సీట్లో అతడి భార్యతో నా భర్త కూడా శారీరకంగా ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత అర్ధరాత్రి మమ్మల్ని ఒక ఫ్లాట్ కు తీసుకెళ్లి వేర్వేరు రూంలలో మమ్మల్ని ఉంచారు.....

Sexual Harassment. Representational Image | (Photo Credits: PTI)

Mumbai, December 19: మహిళలపై లైంగిక దాడులను అరికట్టేందుకు దేశంలో ఎన్ని చట్టాలున్నా, నేరస్తులు ఏ మాత్రం భయపడకపోగా, కొత్తకొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. కట్టుకున్న భార్యనే అత్యాచారం చేసేందుకు స్నేహితులను ప్రోత్సహించిన ఓ భర్త యొక్క ఉదంతం ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో వ్యాపారం చేసుకునే ఓ 45 ఏళ్ల వ్యక్తి భార్యలను మార్చుకునే  (Wife Swapping) పాశ్చాత్య విధానానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తాను కట్టుకున్న భార్యను గత రెండు సంవత్సరాలుగా తన స్నేహితులతో అత్యాచారం (Rape) చేయిస్తూ వస్తున్నాడు. సహనం కోల్పోయిన బాధితురాలు కుటుంబ హింస (Domestic Violence)  కింద పోలీసులను, కోర్టును ఆశ్రయించింది. తనపై జరిగిన లైంగిక దాడులకు సంబంధించిన వివరాలను ఫిర్యాదులో పేర్కొంది.

2017, జూన్ 15న తనపై మొదటిసారి లైంగికదాడి (Sexual Assault)  జరిగిందని చెప్పింది. 'ఆ రోజు రాత్రి తన స్నేహితుడి కారులో బయటకు తీసుకెళ్లిన నా భర్త, తన పక్కన కాకుండా ముందు సీట్లో కారు నడుపుతున్న తన స్నేహితుడి పక్కన కూర్చొబెట్టాడు, నా భర్త మాత్రం వెనక సీట్లో తన స్నేహితుడి భార్య పక్కన కూర్చొన్నాడు. ఆ సమయంలో నా భర్త స్నేహితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించగా, వెనక సీట్లో అతడి భార్యతో నా భర్త కూడా శారీరకంగా ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత అర్ధరాత్రి మమ్మల్ని ఒక ఫ్లాట్ కు తీసుకెళ్లి వేర్వేరు రూంలలో మమ్మల్ని ఉంచారు. నేనున్న రూంలోకి నా భర్త స్నేహితుడు వచ్చి నాపై అత్యాచారం చేశాడు, అతడి భార్యతో నా భర్త కలిశాడు' అని పేర్కొంది. ఈ విషయమై ఆమె తన భర్తను నిలదీసి, తీవ్రంగా గొడవపడితే క్షమించమని వేడుకొంటూ, ఇంకోసారి ఇలా జరగదు అని హామి ఇచ్చాడు.

కానీ, ఆ తర్వాత కూడా తన స్నేహితులను తీసుకొచ్చి ఆమెపై అత్యాచారం చేయించాడు. అలా వేర్వేరు సందర్భాలలో ఒకరి తర్వాత ఒకరితో తనపై అత్యాచారం జరిపించాడమే కాకుండా ఒకరోజు దగ్గరుండి మరి ఆ చర్యను తన మొబైల్ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. ఆ తర్వాత బెదిరింపులకు గురిచేస్తూ అలా రెండు సంవత్సరాలుగా భార్యపై తన పైశాచికత్వం ప్రదర్శిస్తూ వస్తున్నాడు.

దీంతో సహనం నశించిన బాధితురాలు పోలీసులను, కోర్టును ఆశ్రయించడంతో తన భర్తకు మరియు అతడి స్నేహితులకు ఈనెల, డిసెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. వారిపై రేప్ మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

2003 లో వీరి వివాహం అయింది, వీరికి ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారు. బాధితురాలు తన భర్త నుండి విడాకులు కోరుకుంటుంది.