Mumbai Man Lost 1.3 Crore: 10వేల కోసం కక్కుర్తి పడి ఏకంగా కోటీ 30 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి, సినిమా రేటింగ్స్, రివ్యూల పేరుతో భారీ మోసం, ఇళ్లు అమ్మిన డబ్బులన్నీ సైబర్‌ క్రిమినల్స్‌కు ట్రాన్స్ ఫర్‌

అప్పుడు తన ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్ చేయాలని కోరాడు. హోటల్ పరిశ్రమ సమాచారంపై సమీక్ష కావాలంటూ ఆ ఫ్రాడ్ స్టర్ (Fraudstar) వెబ్ లింక్ పంపడం.. దానిపై రేటింగ్ ఇస్తూ స్క్రీన్ షాట్ పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి.

Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

Mumbai, June 16: సెంట్రల్ ముంబై (Mumbai) వాసి ఇటీవలే తన సొంతిల్లు రూ.1.27 కోట్లకు విక్రయించాడు. కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాడు. కానీ సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి రూ.1.3 కోట్ల మొత్తం కోల్పోయాడు. ఆ వ్యక్తికి పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తామని సైబర్ మోసగాళ్లు నమ్మించి బురిడీ కొట్టించారు. టెలిగ్రామ్ యాప్ (Telegram) నుంచి ఒక మహిళ తనకు పార్ట్ టైం జాబ్ ఇస్తామని ఫిబ్రవరి తొమ్మిదో తేదీన మెసేజ్ పెట్టారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదరు మహిళ ఆ బాధితుడ్ని హోటళ్ల పనితీరు, సినిమాలపై రేటింగ్స్, రివ్యూలు (Review) ఇవ్వమని అడిగారు. వాటిని లైక్ చేసిన బాధితుడు ఒక స్క్రీన్ షాట్ తీసి, ఆ మహిళకు ఫోటో పంపాడు. ఓ హోటల్ పనితీరుపై బాధితుడు రాసిన సమీక్షకు ప్రారంభంలో ఆయన బ్యాంకు ఖాతాకు కొద్ది మొత్తం క్రెడిట్ అయ్యాయి. కానీ, తర్వాత రెండు రోజుల్లో బాధితుడి ఖాతాలో ఉన్న రూ.1.27 కోట్ల నగదు.. ఫ్రాడ్‌స్టర్ బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి.

Wife Burns Husband's Penis: దారుణం, భర్త పురుషాంగంపై సలసల కాగే నూనె పోసిన భార్య, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన మొగుడు 

మోసగాళ్లు, అమాయకుల విశ్వాసాన్ని పొందేందుకు ప్రారంభంలో కొద్ది మొత్తం చెల్లిస్తారని, అటుపై వారి ఖాతాల నుంచి భారీగా నగదు దోచేస్తారని పోలీసులు తెలిపారు. సరిగ్గా ఈ బాధితుడి విషయంలోనూ ఇదే జరిగింది. సదరు మహిళ ఆఫర్ చేసిన పని పట్ల ఆసక్తి చూపాడు బాధితుడు. ఆ వ్యక్తి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుపాలంటూ వెబ్ లింక్ పంపింది ఆ మహిళ.. అతడి ఈ-వాలెట్ గురించి తెలుసుకోవడానికి లాగిన్, పాస్ వర్డ్ పంపింది. అప్పుడు తన ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్ చేయాలని కోరాడు. హోటల్ పరిశ్రమ సమాచారంపై సమీక్ష కావాలంటూ ఆ ఫ్రాడ్ స్టర్ (Fraudster) వెబ్ లింక్ పంపడం.. దానిపై రేటింగ్ ఇస్తూ స్క్రీన్ షాట్ పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి. అటుపై సదరు వ్యక్తి ఖాతాలో రూ.17,372 జమ అయ్యాయి. మళ్లీ సినిమాకు రేటింగ్ ఇవ్వమని కోరితే అలాగే చేశాడు. దానికి ప్రతిగా రూ.32 వేలు డిపాజిట్ అయ్యాయి. అతని ఖాతాలో ఆదాయం, ప్రాఫిట్ చెక్ చేసుకోవాలని ఫ్రాడ్ స్టర్ (Cyber crime) సూచిస్తే, రూ.55 వేలు వచ్చాయని చెప్పడంతోపాటు రూ.50 వేలు ఆ మహిళ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు. కానీ, టెక్నికల్ పొరపాటు ఉందంటూ మళ్లీ రూ.55 వేలు పంపాలని ఆమె అనడం.. సదరు వ్యక్తి రూ.55 వేలు మళ్లీ పంపడం పూర్తి చేశాడు.

Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, పోలీస్ కానిస్టేబుల్‌ను లారీతో తొక్కి చంపిన ఇసుక మాఫియా, సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన మంత్రి ప్రియాంక్ ఖర్గే 

ఇలా జరిగిన ప్రక్రియలో గత నెల 17న ఆ మహిళ ఇచ్చిన టాస్క్‌లు అన్నీ పూర్తి చేశాక ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలకు రూ.48 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అలా చేశాక ఆయనకు రూ.60 లక్షల లాభం వచ్చిందని నమ్మ బలికింది. ఈ మొత్తం రావాలంటే రూ.30 లక్షలు పంపాలని పేర్కొంది. అలా మే 18న రూ.76 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. కానీ తర్వాత మనీ రాలేదు. మళ్లీ అడిగితే.. మరింత ఎక్కువ మనీ పంపాలని డిమాండ్ చేసింది సదరు ఫ్రాడ్ స్టర్. అప్పుడు అనుమానం రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ల్లోని సదరు మహిళ ఖాతాలకు మనీ ట్రాన్స్ ఫర్ అయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. ‘ఫిబ్రవరి నుంచి మే వరకు నేరం జరిగింది. రూ.1.27 కోట్ల మోసంపై కేసు నమోదైంది. సదరు మహిళ ఎనిమిది బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశాం’ అని పోలీసులు చెప్పారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)