Karnataka Horror: ప్రియురాలిని వ్యభిచారంలోకి దింపారని 5 మంది మహిళలను కిరాతకంగా చంపిన లవర్, పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు

ప్రియురాలిని బలవంతంగా సెక్స్ కూపంలోకి దించారన్న కోపంతో (girlfriend for killing 5 women) 5 మంది మహిళలను లవర్స్ దారుణంగా చంపేశారు. అనంతరం వారి మృతదేహాలను ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు.

Representative Image Murder ( Photo Credits : Pixabay

Bengaluru, August 10: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని బలవంతంగా సెక్స్ కూపంలోకి దించారన్న కోపంతో (girlfriend for killing 5 women) 5 మంది మహిళలను లవర్స్ దారుణంగా చంపేశారు. అనంతరం వారి మృతదేహాలను ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు. అంతే కాకుండా మరో ఐదుగురిని హతమార్చేందుకు కూడా స్కెచ్ వేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని మండ్యాలో వెలుగు చూసింది.ఈ కేసులో 35 ఏళ్ల వ్యక్తితో పాటు అతడి ప్రేయసిని పోలీసులు అరెస్ట్‌ (Mandya Police nabs man) చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామనగర జిల్లాలోని కుదుర్‌కు చెందిన సిద్ధలింగప్ప బెంగళూరులోని పీన్యాలో ఫాబ్రికేషన్‌ విభాగంలో పని చేస్తున్నాడని చెప్పారు. అతడి ప్రేయసిని చంద్రకళగా గుర్తించామని తెలిపారు. తన ప్రియురాలిని మహిళలు బలవంతంగా వ్యభిచారంలోకి దింపారని ఆరోపించాడు. అందుకే హత్య చేసినట్లు పోలీసులకు అతను తెలిపాడు.ఈ హత్యలు చేసేందుకు నిందితుడికి సహకరించిన కారణంగా అతని ప్రియురాలిని కూడా అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మిస్టరీ ఎలా వీడింది

కర్ణాటకలో ఐదుగురు మహిళల హత్యలు కొద్ది నెలల క్రితం జరిగాయి.జూన్‌ 8న మండ్యాలో కుళ్లిపోయిన ఓ శవం దొరికింది. ఆ తర్వాత అదే స్థితిలో మరో మృతదేహం లభించింది. ఆ రెండు ప్రాంతాల మధ్య 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.ఈ రెండు మృతదేహాలు సగభాగం మాత్రమే లభించాయి. దీంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 9 టీంలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మిస్సింగ్‌ కేసులను పరిశీలించారు. కర్ణాటకతో పాటు పక్క రాష్ట్రాల్లోనూ మొత్తం 1,116 మిస్సింగ్‌ కేసులను పరిశీలించారు. చివరకు బెంగళూరులో నిందితుడు సిద్ధలింగప్పను అరెస్ట్‌ చేశారు.

తాంత్రికుడి మాటలు నమ్మి.. తల్లిదండ్రులను దారుణంగా చంపేసిన యువకుడు, ఈ కిరాతకానికి సహకరించిన బాలుడి బంధువులు

కాగా కొన్నేళ్ల క్రితం వరకు సెక్స్‌ వర్కర్‌గా చేసిన చంద్రకళతో తనకు సంబంధం ఏర్పడిందని సిద్ధలింగప్ప పోలీసులకు తెలిపాడు.అయితే ఆ సమయంలో ఇద్దరం ప్రేమించుకున్నామని అయితే తనను బలవంతంగా ఈ కూపంలోకి (forced her into sex trade) లాగారని ప్రియురాలు ప్రియుడికి తెలిపింది. దీంతో ఆమెను బలవంతంగా పడుపు వృత్తిలోకి దించిన వారిని చంపాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మే నెలలో బెంగళూరులో తొలి హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. మే 30, జూన్‌ 3న మైసూర్‌లో మరో ఇద్దరు మహిళలను చంద్రకళ సాయంతో హతమార్చాడు. మిగిలిన వారిని సైతం వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.