Manmohan Singh Health Update: డెంగ్యూ బారీన పడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎయిమ్స్‌లో చికిత్స తీసుంటున్న ప్రముఖ ఆర్థికవేత్త, నిలకడగా ఆరోగ్యం

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు డెంగ్యూ (Former Prime Minister Diagnosed With Dengue) సోకింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

File image of former Prime Minister Dr Manmohan Singh | (Photo Credits: PTI)

New Delhi, Oct 16: కొన్నిరోజుల కిందట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (89) అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించడం తెలిసిందే. ఆయన జ్వరం, నీరసంతో బాధపడుతుండడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మన్మోహన్ అనారోగ్యానికి కారణం వెల్లడైంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు డెంగ్యూ (Former Prime Minister Diagnosed With Dengue) సోకింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు.

ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఎయిమ్స్‌లో మన్మోహన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య క్రమంగా మెరుగుపడుతోందని (Manmohan Singh Health Update) వైద్యులు వివరించారని తెలిపారు. మన్మోహన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ నితీశ్ నాయక్ పర్యవేక్షణలో ఎయిమ్స్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని ఎయిమ్స్ తాజా బులెటిన్ లో పేర్కొన్నారు. కాగా, ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మన్మోహన్ ను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పరామర్శించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif