Morgan Stanley Layoffs: ఉద్యోగులను పీకేసిన మరో దిగ్గజ కంపెనీ, 1600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మోర్గాన్ స్టాన్లీ, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనలే కారణం

ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఉద్యోగుల తీసివేతకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం లేదా దాదాపు 1,600 మంది ఉద్యోగుల తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి.

Job Cut. (Photo Credits: Pixabay)

ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఉద్యోగుల తీసివేతకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం లేదా దాదాపు 1,600 మంది ఉద్యోగుల తొలగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా కొంతమందిని తొలగించబోతున్నామన్న మోర్గాన్ స్టాన్లీ సీఈవో జేమ్స్ గోర్డాన్ ఇటీవల వ్యాఖ్యలను ఉటింకిస్తూ సీఎన్‌బీసీ మీడియా నివేదించింది.

భారతీయ ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్, నవంబర్ 30 లోపు కంపెనీని వదిలేయాలని ఆదేశాలు, కంపెనీ అందించే బెనిఫిట్స్ తీసుకుని రిజైన్ చేయాలని సూచన

కంపెనీలో దాదాపు 81,567 మంది ఉద్యోగులున్నారు. అయితే ఈ నివేదికపై గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఇంకా వ్యాఖ్యానించలేదు.మోర్గాన్ స్టాన్లీ ప్రత్యర్థి గోల్డ్‌మన్ సాచ్స్ ,సిటీ గ్రూప్, బార్క్లేస్‌ సహా ఇతర పెట్టుబడి సంస్థలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మోర్గాన్‌ స్టాన్లీ చేరింది.

గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్, 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ, పేలవమైన పనితీరు ప్రదర్శించే వారిని బయటకు పంపే ప్రయత్నం

కాగా ఆర్థిక మాంద్యం, ఆదాయా కక్షీణత నేపథ్యంలో ట్విటర్‌, అమెజాన్, మెటా, పెప్సీకో లాంటి అనేక ఇతర కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement