MP Shocker: ఇంత రాక్షసత్వమా, ట్రక్కుకు మనిషిని కట్టేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన క్రూరులు, మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో దారుణ ఘటన, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

45 ఏళ్ల ఓ వ్య‌క్తిని ట్ర‌క్కుకు క‌ట్టేసి.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లి.. చిత్ర‌హింస‌లు ( Tied To Truck And Dragged) పెట్టి చంపేశారు. కన్హయలాల్‌ భీల్‌(40)అనే ఆదివాసిని దొంగ‌గా భావించి.. ప‌ట్టుకొని కొంద‌రు వ్య‌క్తులు క‌లిసి చిత‌క్కొట్టారు.

40-Year-Old Man Dies by Mob Attack in Neemuch district (Photo-Video grab)

Bhopal, August 28: దొంగతనం అభియోగాలపై ఒక ఆదివాసిని ఎనిమిది మంది తీవ్రంగా హింసించి చంపిన అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో (Neemuch district) జరిగింది. 45 ఏళ్ల ఓ వ్య‌క్తిని ట్ర‌క్కుకు క‌ట్టేసి.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లి.. చిత్ర‌హింస‌లు ( Tied To Truck And Dragged) పెట్టి చంపేశారు. కన్హయలాల్‌ భీల్‌(40)అనే ఆదివాసిని దొంగ‌గా భావించి.. ప‌ట్టుకొని కొంద‌రు వ్య‌క్తులు క‌లిసి చిత‌క్కొట్టారు. ఆ త‌ర్వాత పోలీసుల‌కు ఫోన్ చేసి దొంగ దొరికాడ‌ని.. వ‌చ్చి తీసుకెళ్లాల‌ని చెప్పారు. పోలీసులు వ‌చ్చే లోపే.. ట్ర‌క్కుకు అత‌డి కాళ్ల‌ను క‌ట్టేసి.. చిత్ర‌హింస‌లు పెట్టి.. ట్ర‌క్కుతో రోడ్డు మీద ఈడ్చుకెళ్లి.. రోడ్డు మీద‌నే అలాగే అత‌డిని వ‌దిలేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

పోలీసులు అక్క‌డికి వెళ్లి చూసేస‌రికి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు ఆ వ్య‌క్తి. వెంట‌నే అత‌డిని నీముచ్ జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించగా చికిత్స పొందతూ (40-Year-Old Man Dies by Mob Attack) అత‌డు చ‌నిపోయాడు.అత‌డిని ట్ర‌క్కుకు క‌ట్టి.. ఈడ్చుకెళ్తుంటే.. కొంద‌రు వీడియో తీసి.. దాన్ని సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైర‌ల్ అయింది.కన్హయలాల్‌ భీల్‌(40)అనే ఆదివాసిని చితార్‌మల్‌ గుర్జార్‌ అనే పాల వ్యాపారి బైక్‌తో ఢీకొట్టాడు.

ఓ పక్క తాగుడు..మరో పక్క అప్పులు, ముగ్గురు చిన్నారులను, భార్యను దారుణంగా గొంతు కోసి చంపేసిన కసాయి, ఆపై విషం తాగి ఆత్మహత్య, యూపీలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ ఘటనలో గుర్జార్‌ పాలు నేలపాలయ్యాయి. దీంతో కన్హయలాల్‌ కావాలనే తన బండికి అడ్డువచ్చాడని ఆరోపిస్తూ తన స్నేహితులను పిలిచి కన్హయపై గుర్జార్‌ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. కన్హయలాల్‌ను తీవ్రంగా కొట్టి అనంతరం ఒక వాహనం వెనుక తాడుతో కట్టి ఈడ్చుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై గుర్జార్‌తో పాటు నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్‌పీ సూరజ్‌ కుమార్‌ తెలిపారు. గుర్జార్‌కు చెందిన మోటార్‌సైకిల్‌ను, కన్హయను కట్టేసిన వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు.