National Monetisation Pipeline: అసలేంటి నేషనల్ మానిటైజేషన్ ఫైప్‌లైన్, నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్లు సమీకరణే లక్ష్యంగా కేంద్రం అడుగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ఇక ప్రైవేట్ పరం, ఆస్తుల నగదీకరణ (మానిటైజేషన్)‌లో ముఖ్యమైన విషయాలు

ఈ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం రూ. నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్లను (Centre unveils Rs 6 lakh crore plan) సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

FM Nirmala Sitharaman. (Photo Credits: Twitter@FinMinIndia)

New Delhi, August 25: కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ఇక ప్రైవేట్ పరం కానుంది. ఈ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం రూ. నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్లను (Centre unveils Rs 6 lakh crore plan) సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ ఆస్తుల నగదీకరణ (Monetisation ) కోసం నేషనల్ మానిటైజేషన్ ఫైప్‌లైన్ (National Monetisation Pipeline) తీసుకువచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరే నిధులను మళ్లీ మౌళిక వసతుల కల్పనకే వెచ్చిస్తామన్నారు. మానిటైజేషన్ అంటే విక్రయం కాదని మంత్రి (FM Sitharaman) స్పష్టం చేశారు.

ఆస్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకే ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగిస్తున్నామని, గడువు తీరిన తర్వాత అది మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ రూపొందించిన ఈ కార్యక్రమ వివరాలను మంత్రి విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ "ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల ఆస్తులను మరింతగా పర్యవేక్షించొచ్చు. వీటిలో పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలను పెంచవచ్చు.

అయితే మేం వీటిని అమ్మేస్తున్నాం అనే అనే వారికి ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ఈ ఆస్తులను పర్యవేక్షిస్తాం. అయితే, యాజమాన్య హక్కులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానివే, నిర్దేశిత గడువులోగా తిరిగి మళ్లీ వాటిని తీసుకుంటాము" అని సీతారామన్‌ పేర్కొన్నారు.

ప్రమాదకరంగా మారుతున్న డెల్టా ప్లస్ వేరింయట్, దేశంలో 37,593 కొత్త కరోనా కేసులు, 648 మంది మృతి, మహారాష్ట్రలో ఒకే రోజు 27 కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు

2019 డిసెంబర్ లో ఇన్ ఫ్రాస్ట్రక్చ ర్ పైప్ లైన్ ప్రారంభించామని అన్నారు. ఈ ఏడాది అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రారంభిస్తున్నాం, ఈ రెండూ ఒకేసారి ముగుస్తాయి. అసెట్ మానిటైజేషన్ ద్వారా పబ్లిక్, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని ప్రోత్సాహిస్తాం, వృథాగా పడి, పూర్తి స్థాయిలో వినియోగించని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా కార్యక్రమాన్ని రూపొందింస్తామని తెలిపారు.

ఒప్పంద భాగస్వాములు తప్పనిసరిగా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. నియంత్రణ సంస్థల పనితీరును ప్రధానమంత్రే నేరుగా సమీక్షిస్తారని, దీంతో వాటి నుంచి నిరంతరం చేయూత అందుతుందని భావిస్తున్నామని మంత్రి అన్నారు. బడ్జెట్లో చెప్పినట్లే పథకం తీసుకువస్తున్నామని ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనాతోనే పోలేదు, రాబోయే 60 సంవత్సరాల్లో అంతకన్నా ప్రమాదకర వైరస్‌లు దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి, సంచలన విషయాలను వెల్లడించిన పరిశోధకులు

ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్‌ లైన్ల ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తోంది. వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా రంగాలన్నీ ప్రైవేట్‌ పరం చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఎయిర్‌పోర్టు నిర్వహణలో 'పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ)' సత్ఫలితాలిస్తోందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని రైల్వేస్టేషన్లకు కూడా విస్తరించాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజా అసెట్‌ మానిటైజేషన్‌లో పెద్ద ఎత్తున ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

రాష్ట్రాలకు మరో రూ.10 వేల కోట్ల రుణం

మహమ్మారి సమయంలో రాష్ట్రాలకు వడ్డీ లేకుండా 50 ఏళ్ల కాలానికి రూ.12 వేల కోట్ల రుణం ఇచ్చాం. ఈ ఏడాది మరో రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. వీటి ద్వారా రాష్ట్రాలు తమకు ఇష్టమైన మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టవచ్చు. రాష్ట్రాలకు సాయం చేయడానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాం. అయితే మూడు షరతులకు లోబడి ఈ నిధులను అందిస్తాం.

ఈ షరతులకు లోబడే నిధులు

1) రాష్ట్రాలు తమ ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి. యాజమాన్య హక్కులనూ బదిలీ చేయాలి. తద్వారా ఎంత మొత్తం సమకూరితే, అందుకు సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఇస్తుంది.

2) ప్రైవేటీకరణ కాకుండా... రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను మార్కెట్‌లో లిస్ట్‌చేస్తే చాలు. ఆ లిస్టింగ్‌ ద్వారా వచ్చే డబ్బులో 50% మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది.

3) రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఆస్తులను మానిటైజ్‌ చేస్తే, తద్వారా వచ్చే మొత్తంలో 33 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్రం ఇస్తుంది.’’ అని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

ఏమేం ఆస్తులు వస్తాయి? 

‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్యమైన, మౌలిక వసతులన్నీ వస్తాయి. 12 శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఇందులో ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యుత్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఆపరేట్‌ మెయింటెన్‌, ట్రాన్స్‌ఫర్‌, టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌, ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌, డెవలప్‌మెంట్‌, రిహాబిలిటేట్‌ ఆపరేట్‌ మెయింటెయిన్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానాల్లో ఈ ఆస్తులను అప్పగిస్తారు.

* రైల్వేలో 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 1,400 కిలోమీటర్ల ట్రాక్‌, 265 గూడ్స్‌షెడ్లు, 741 కిలోమీటర్ల కొంకణ్‌ రైల్వే, 4 హిల్‌ రైల్వే, 674 కిలోమీటర్ల డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌, 15 రైల్వే స్టేడియంలను ప్రైవేటు వారికి అప్పగిస్తారు.

* ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు.

* దిల్లీ, హైదరాబాద్‌, బెంగుళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు.

* 9 మేజర్‌ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు.

* బీబీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, డిపార్ట్‌మెంట్‌ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు.

* జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు.

ఢిల్లీలోని ది అశోక్‌ ప్రైవేట్ పరం

రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక 5 స్టార్‌ హోటల్‌ ‘ది అశోక్‌’ను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వరంగంలో సామర్థ్యానికి తగినట్లు వినియోగించని మౌలిక ఆస్తులను నగదీకరణ చేయాలన్న (ఎన్‌ఎంపీ) నిర్ణయంలో భాగంగా ఈ హోటల్‌ను కూడా ప్రైవేటుకు అప్పగించనున్నారు. ప్రభుత్వం ఈ జాబితాలో ప్రకటించిన జాతీయ ఆస్తుల జాబితాలో ‘ది అశోక్‌’తో పాటు ఆ సమీపంలోనే ఉండే హోటల్‌ సామ్రాట్‌ కూడా ఉంది. ది అశోక్‌ను సబ్‌ లీజు పద్ధతిలో, సామ్రాట్‌, భువనేశ్వర్‌లోని కళింగ అశోక్‌, జమ్ములోని జమ్ము అశోక్‌లను రోజువారీ కార్యకలాపాలు- నిర్వహణ (ఆపరేషన్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌) కింద ప్రైవేటుకు బదలాయిస్తారు.

రాంచీలోని హోటల్‌ రాంచీ అశోక్‌, పూరిలోని హోటల్‌ నీలాంచల్‌, హోటల్‌ పాండిచ్ఛేరి అశోక్‌ను సంయుక్త లీజ్‌ కింద కేటాయిస్తారు. ఆనందపూర్‌ సాహిబ్‌ హోటల్‌ యాజమాన్య హక్కులు కూడా బదలాయిస్తారు. ఇవన్నీ 2022-25 మధ్య జరగనున్నాయి. ప్రధాన నగరాల్లో 125 ఎకరాల విస్తీర్ణంలో ఐటీడీసీ హోటళ్లున్నాయి. ప్రస్తుతం ఐటీడీసీ ఆధ్వర్యంలో అశోక్‌ గ్రూప్‌లోని 4 హోటళ్లు, మరో 4 సంయుక్త భాగస్వామ్య హోటళ్లు, 7 రవాణా సంస్థలు, నౌకాశ్రయాల్లోని 14 డ్యూటీ ఫ్రీ షాప్‌లు, సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఒకటి, 4 క్యాటరింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రంలో ఇవే

ఇక తమిళనాడు రాష్ట్రంలో సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌, తూత్తుకుడి ఓడరేవు, ఆరు విమానాశ్రయాలు, ఎన్నెల్సీ, ఊటీ కొండరైలు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. నైవేలిలోని ఎన్సెల్సీ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, కావేరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని సహజ ఇంధన వాయువులు, తూత్తుకుడి ఓడరేవును ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారు. ఇదేవిధంగా పుదుచ్చేరిలోని రైల్వేస్టేషన్‌, హోటల్‌ అశోక్‌ను లీజుకు ఇవ్వనున్నారు. ఇక రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాలను కూడా వరుసగా ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్ళనున్నాయి. తొలుత తిరుచ్చి విమానాశ్రయాన్ని లీజుకు ఇస్తారు. ఆ తర్వాత వరుసగా మదురై, కోయంబత్తూరు, చెన్నై విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలు లీజుకు తీసుకుంటాయి.

చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారి, కృష్ణగిరి - తోప్పూరు, కృష్ణగిరి - హోసూరు, తిరుచ్చి - కారైక్కుడి, తిరుచ్చి బైపాస్‌ రోడ్డును లీజుకు ఇవ్వనున్నారు. ఇక భారత వారసత్వ సంపదగా పరిగణించే నీలగిరి కొండ రైలు (ఊటీ హిల్‌ ట్రైన్‌)ను కూడా ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ఖాయమని తెలిసింది. ఊటీ కొండ రైలు సంస్థకు సంబంధించి పలు ఎస్టేట్‌ భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ త్వరలోనే ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్ళనున్నాయి.