NEET UG 2024 Paper Leak Case: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ, నీట్‌ యూజీ 2024 పరీక్ష ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నీట్‌ యూజీ 2024 పరీక్ష (NEET UG 2024 Exam) ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం.. అందుకుగల కారణాలను వివరిస్తూ శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది.

Supreme Court allows sub classification of SC, ST for reservation(X)

New Delhi, August 2: నీట్‌ యూజీ 2024 పరీక్ష (NEET UG 2024 Exam) ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం.. అందుకుగల కారణాలను వివరిస్తూ శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ జరిగిందని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. నీట్ యూజీసీ పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

నీట్‌ పేపర్‌ లీకేజీ (NEET Row)లో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు చోటుచేసుకోలేదు. పరీక్ష పవిత్రతను దెబ్బతీసేలా విస్తృత స్థాయిలో లీక్‌ జరగలేదు. ప్రశ్నపత్రం లీకేజీ (Paper leak) ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పాట్నా వరకే పరిమితమైంది.ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.. అందుకే మేం పరీక్షను రద్దు చేయాలనుకోలేదని తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కారాదని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్‌‌లో విస్తుగొలిపే విషయాలు, ఐదు కొత్త కేసులు నమోదు చేసిన సీబీఐ అధికారులు, నాలుగు దశల్లో విచారణ చేపట్టనున్న సీబీఐ

ఈసందర్భంగా ఎన్టీయే (NTA) పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం నియమించిన ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యానెల్‌ను మరింత విస్తరించాలని పేర్కొంది. పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలపై కమిటీ సెప్టెంబరు 30లోగా తమ నివేదికను అందజేయాలని ఆదేశించింది.నివేదిక అందజేసిన తర్వాత అందులో అమలు చేసే అంశాలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.

ఈ ఏడాది మే 5వ తేదీన వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు.దేశంలో గల 571 నగరాల్లో 4750 సెంటర్లలో పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి.

దీంతో పేపర్‌ లీకేజీ (NEET Paper Leak), ఇతర అక్రమాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now