New EPF Rule: ఈపీఎఫ్‌లో కీలక అప్‌డేట్, వైద్య చికిత్సకు రూ.లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి, పూర్తి వివరాలు ఇవిగో..

ఇకపై PF ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స(medical treatment) కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే గతంలో దీని గరిష్ట పరిమితి రూ. 50,000గా మాత్రమే ఉండేది

EPFO (photo-ANI)

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభవార్తను అందించింది. ఇకపై PF ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స(medical treatment) కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే గతంలో దీని గరిష్ట పరిమితి రూ. 50,000గా మాత్రమే ఉండేది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 16 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. అంతేకాదు ఏప్రిల్ 10న EPFO అప్లికేషన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌(software)లో కూడా మార్పులు చేసింది. EPFO ఫారమ్ 31లోని 68J పేరా కింద డబ్బు ఉపసంహరణ(withdrawal) చేసుకోవచ్చు. భారత మార్కెట్లోకి అసుస్ జెన్ బుక్ డ్యూ, ధర రూ.1,59,990పై మాటే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

EPFO ఫారమ్ 31 అనేది పాక్షిక ఉపసంహరణకు సంబంధించినది. ఇది వివిధ ప్రయోజనాల కోసం డబ్బును అకాల ఉపసంహరణకు ఉపయోగించబడుతుంది. వేర్వేరు పనులు, వేర్వేరు పేరాల్లో ఉంచబడ్డాయి. వాటిలో వివాహం, ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం, చికిత్స కోసం డబ్బు తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.నెల అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా.. శస్త్రచికిత్సలు చేయించుకున్నా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్‌, హృద్రోగ చికిత్సల కోసమూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లోనూ క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్లు లేకుండానే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించి దీన్ని పొందొచ్చు. అయితే, ఉద్యోగి ఆరు నెలల బేసిక్‌ ప్లస్‌ డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా (వడ్డీ సహా).. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలుటుంది.