అసుస్ (Asus) తాజాగా భారత్ మార్కెట్లో తన అసుస్ జెన్ బుక్ డ్యూ- 2024 (Asus Zenbook Due 2024)ను విడుదల చేసింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో డ్యుయల్ 14-అంగుళాల లుమినా ఓలెడ్ టచ్ స్క్రీన్స్‌తో ఈ ల్యాపీ వస్తోంది. విండో11 హోం ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. డిటాచబుల్ ఎర్గో సెన్స్ కీ బోర్డు, టచ్ పాడ్ విత్ మల్టీ టచ్ గెస్చర్స్ కలిగి ఉంటుంది. ఇంటెల్ కోర్ ఆల్ట్రా9 ప్రాసెసర్ తోపాటు 32 జీబీ ర్యామ్ సామర్ధ్యంతో వస్తున్నది. 65వాట్ల యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మద్దతుతో 75వాట్ల బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఇంటెల్ కోర్ ఆల్ట్రా 5 ప్రాసెసర్‌తో కూడిన అసుస్ జెన్ బుక్ డ్యూ 2024 లాప్ టాప్ రూ.1,59,990, ఇంటెల్ కోర్ ఆల్ట్రా 7 వేరియంట్ రూ.1,99,990 పలుకుతుంది. ఇంటెల్ కోర్ ఆల్ట్రా 9 సీపీయూ తో వస్తున్న లాప్ టాప్ రూ.2,19,990, ఇంటెల్ కోర్ ఆల్ట్రా 9 సీపీయూ ధర రూ.2,39,999 గా ఉంది.
అసుస్ జెన్ బుక్ డ్యూ 2024 లాప్ టాప్ ఫుల్ హెచ్డీ+ (1900×1200 పిక్సెల్స్) ఓలెడ్ టచ్ స్క్రీన్స్ విత్ 100 శాతం డీసీఐ:పీ3 కలర్ గమట్ కవరేజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ తోపాటు ఇంటెల్ కోర్ ఆల్ట్రా9 సీపీయూస్ ఉంటాయి. 32 జీబీ ర్యామ్ తోపాటు 2 టిగా బైట్స్ ఎస్ఎస్డీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. గూగుల్ నుంచి 4 పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయోచ్, అదిరిపోయే ఫీచర్లతో పాటు ఫోల్డబుల్ మోడల్ కూడా..
అసుస్ జెన్ బుక్ డ్యూ 2024 లాప్ టాప్ వై-ఫై6ఈ, బ్లూటూత్ 5.3, టూ థండర్ బోల్ట్ 4 పోర్ట్స్, వన్ యూఎస్బీ 3.2 జెన్ 1 టైప్-ఏ పోర్ట్, హెచ్డీఎంఐ 2.1 పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ లాప్ టాప్ విండోస్ 11 హోం వర్షన్ పై పని చేస్తుంది. ఫేసియల్ రికగ్నిషన్ అండ్ వీడియో కాల్స్ కోసం ఈ లాప్ టాప్‌లో ఆంబియెంట్ లైట్ సెన్సర్‌తోపాటు ఫుల్ హెచ్డీ ఏఐ సెన్స్ ఐఆర్ కెమెరా ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ తోపాటు రెండు హార్మోన్ కార్డాన్ ట్యూన్డ్ స్పీకర్లు కూడా జత చేశారు.