టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది నాలుగు న్యూ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్లు విడుదల చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వనిలా గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ, గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఎక్స్ఎల్ పేరుతో గూగుల్ లేటెస్ట్ పిక్సెల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. వీటితో పాటుగా పిక్సెల్ 9 ప్రొ ఫోల్డ్ పేరుతో ఫోల్డబుల్ మోడల్ కూడా ఈ సిరీస్‌లో ఉంటుందని చెబుతున్నారు.మోటో నుంచి రూ. 15 వేలకే 5 జీ ఫోన్, రెండు వేరియంట్లలో జీ64ను విడుదల చేసిన మొబైల్ తయారీ దిగ్గజం
ఈ ఫోన్‌కు కోమెట్ అని కోడ్‌నేమ్ ఇచ్చారని అండ్రాయిడ్ అథారిటీ రిపోర్ట్ పేర్కొంది.పిక్సెల్ 9 రౌండెడ్ కెమెరాలు, ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటుగా పిక్సెల్ 9 టెలిఫొటో లెన్స్‌తో రానున్నాయి. . ఈ ఏడాది మే 14న జరిగే గూగుల్ I/O ఈవెంట్ వేదికగా పిక్సెల్ 9కు సంబంధించిన వివరాలను టెక్ దిగ్గజం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.