Moto G64 5G (Photo Credits: Official Website)

ప్రముఖ మొబైల్‌ తయారీ దిగ్గజం మోటోరొలా (Motorola) తన కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ జీ64ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గతంలో తీసుకొచ్చిన జీ62 స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా జీ64 5జీని (Moto G64) భారత్ లో లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్‌ 14, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ వస్తోంది.

మోటో 64 5జీ 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.16,999గా పేర్కొంది. అయితే భవిష్యత్తులో రేట్లను సవరించే అవకాశం ఉంది. ఐస్‌ లైలాక్‌, మింట్‌ గ్రీన్‌, పెర్ల్‌ బ్లూ రంగుల్లో రెండు వేరియంట్లు లభిస్తున్నాయి. మోటోరొలా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్, రిటైల్‌ స్టోర్లలో ఈ మొబైల్‌ను ఏప్రిల్‌ 23 నుంచి కొనుగోలు చేయొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డులతో కొనుగోళ్లపై రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. సామ్‌సంగ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్, వీటిలో ఒక మోడల్ ధర తక్కువ, మరొక మోడల్ కాస్త ఖరీదైనది.. వీటి ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకోండి!

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14తో వస్తోంది. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ లభిస్తాయి. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌, 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7025 ప్రాసెసర్‌, ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్, ముందు వైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5జీ, బ్లూటూత్‌ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో వస్తోంది. ఇందులో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.