Samsung Galaxy M15 and Galaxy M55 5G: దక్షిణ కొరియా టెక్నాలజీ బ్రాండ్ సామ్‌సంగ్ తాజాగా గెలాక్సీ M సిరీస్‌లో Galaxy M15 మరియు Galaxy M55 5G అనే రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో 'సామ్‌సంగ్ గెలాక్సీ ఎం15' మోడల్ బడ్జెట్ ధరలో లభించే ఒక ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ కాగా, 'సామ్‌సంగ్ గెలాక్సీ M55' అనేది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్.
మొదటి మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరలు భారత మార్కెట్లో రూ. 14 వేల నుంచి ప్రారంభమవుతుటే, మిడ్-రేంజ్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ధరలు రూ. 27 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కూడా సరికొత్త ఆండ్రాయిడ్ 14లోని కంపెనీ యొక్క One UI 6.1తో రన్ అవుతాయి. అంతేకాకుండా నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను పొందుతాయని కంపెనీ తెలిపింది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం15 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ మరియు స్టోన్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలైన విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Samsung Galaxy M15 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే
- 4GB/6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+5MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 13MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 6000mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఛార్జింగ్ సపోర్ట్
ధరలు: 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,299, అలాగే 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,799
ఇదిలా ఉంటే, సామ్‌సంగ్ గెలాక్సీ ఎం55 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది, ఇది డెనిమ్ బ్లాక్ మరియు లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలైన విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Samsung Galaxy M55 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ సూపర్ AMOLED డిస్‌ప్లే
- 8GB/12GB RAM, 128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 50MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ధరలు: 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999/-
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999, అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999/-