New Rules For Foreign Arrivals: విదేశాల నుంచి వచ్చేవారికి కొత్త నిబంధనలు, ఇక నుంచి ఐసోలేషన్ లేదు, రిస్క్ దేశాల జాబితా కూడా ఎత్తివేసిన కేంద్రం, కరోనా కేసులు తగ్గడంతో నిర్ణయం
గత కొద్దిరోజులుగా కరోనా రోజువారీ కేసులతో పాటూ , డైలీ పాజిటివిటీ రేటు అదుపులోకి వచ్చింది. దీంతో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఒమిక్రాన్ ఉద్ధృతి మయంలో కొన్ని దేశాలను ‘ఎట్-రిస్క్’గా (at risk) పరిగణించగా.. ఇప్పుడా కేటగిరీని తీసేసింది.
New Delhi Feb 10: భారత్‌లో కరోనా (Corona) తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా రోజువారీ కేసులతో పాటూ (Daily Corona cases), డైలీ పాజిటివిటీ రేటు అదుపులోకి వచ్చింది. దీంతో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఒమిక్రాన్ ఉద్ధృతి (Omicron) సమయంలో కొన్ని దేశాలను ‘ఎట్-రిస్క్’గా (at risk) పరిగణించగా.. ఇప్పుడా కేటగిరీని తీసేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను కూడా తొలగించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ (Union Health Ministry) తెలిపింది. అయితే ప్రయాణికులు దేశంలోకి వచ్చిన తర్వాత 14 రోజులు స్వీయ పర్యవేక్షణలో (self-monitoring) ఉండాలని సూచించింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను నేడు విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు (new guidelines) ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
విదేశీ ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలు
1. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ‘ఎయిర్ సువిధ పోర్టల్’లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను నింపాలి.
2. ప్రయాణికులు తప్పనిసరిగా తమ ప్రయాణానికి ముందు(72 గంటలు దాటకూడదు) ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు ( RT-PCR test) చేయించుకోవాలి. నెగెటివ్ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. లేదా, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ధ్రువపత్రాన్ని సమర్పించాలి.
3. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో (Self declaration) పూర్తి సమాచారం ఇచ్చి, నెగెటివ్ పత్రం లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసిన వారినే విమానంలోకి ఎక్కేందుకు అనుమతించాలి.
4. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానంలోకి ఎక్కించుకోవాలి.
5. విమానంలో ప్రయాణికులంతా అన్ని వేళలా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలి.
6. ప్రయాణంలో ప్రయాణికులెవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు చెబితే వారిని ప్రొటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్‌లో ఉంచాలి.
7. ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు హెల్త్ స్టాఫ్‌కు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని చూపించాలి.
8. ల్యాండ్ అయిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్‌లో లక్షణాలు కన్పిస్తే వెంటనే ఆ ప్రయాణికులను ఐసోలేషన్‌లో ఉంచి కొవిడ్ పరీక్షలు చేయాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టాలి.
9. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ 14 రోజలు పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి. ఈ సమయంలో ఎవరికైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్‌లో ఉండాలి.
ఇటీవల ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఎట్ రిస్క్ దేశాల జాబితాను కేంద్రం రూపొందించారు. అంతేగాక, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా 7 రోజలు పాటు క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం ఆదేశించింది. తాజాగా ఆ నిబంధనను ఎత్తివేస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు