Rs. 2000 Notes in ATMs: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన, ఏటీఎంలలో ఆ నోట్లు నింపడమనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

రూ.2వేల నోట్లకు సంబంధించి పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని, దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా పార్లమెంటులో తెలియజేశారు.

Representative Image

కనీస మద్దతు ధరపై రైతులకు హమీ ఇవ్వని కేంద్రం, కిసాన్ ఆందోళన్ 2.0కు రెడీ అవుతున్న రైతు సంఘాలు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వార్షిక నివేదికల ప్రకారం.. రూ.500, రూ.2,000 నోట్ల మొత్తం విలువ 2017 మార్చి చివరి నాటికి రూ.9.512 లక్షల కోట్లు. అదే 2022 మార్చి చివరి నాటికి రూ.27.057 లక్షల కోట్లు అని ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.

వ్యక్తుల సహజీవనంతో కేంద్రానికి ఏం సంబంధం, తెలివి తక్కువ ఆలోచనతో పిటిషన్ వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు నింపకూడదని బ్యాంకులకు ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పారు. తమ కస్టమర్ల అవసరాలు, కాలానుగుణ ధోరణి మొదలైన వాటి ఆధారంగా బ్యాంకులు అంచనా వేసి ఏటీఎంలలో నోట్లను నింపుతాయని వివరించారు.

Here's News Update

ఇదిలా ఉంటే ఆర్బీఐ గత కొన్నేళ్లుగా కనీసం ఒక్క రూ.2000 కరెన్సీ నోటును కూడా ప్రింట్ చేయలేదు. ఏటీఎంలలో ఈ నోట్లు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2019లోనే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆపేసినట్టు ఆర్‌బీఐ ఆ మధ్య తెలిపింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement