Vinesh Phogat Disqualified: వినేశ్ ఫోగట్‌ అనర్హత వేటుపై స్పందించిన బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్, ఏమన్నారంటే..

Paris Olympics 2024 నుండి భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై, BJP MP కరణ్ భూషణ్ సింగ్ స్పందించారు. ఇది దేశానికి పూర్తిగా నష్టం. ఫెడరేషన్ దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఏమి చేయగలదో చూస్తుంది" అని అన్నారు

Paris Olympics 2024: Vinesh Phogat Disqualified From FInal, BJP MP Karan Bhushan Singh says It is a loss for the country

BJP MP Karan Bhushan Singh on Vinesh Phogat Disqualified : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం. వినేష్ గోప్యతను గౌరవించాలని భారత జట్టు మిమ్మల్ని అభ్యర్థిస్తోంది. ఇది చేతిలో ఉన్న పోటీలపై దృష్టి పెట్టాలనుకుంటోందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది.  ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్, అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు, స్వర్ణ పతక ఆశలు ఆవిరి

ఇక Paris Olympics 2024 నుండి భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై, BJP MP కరణ్ భూషణ్ సింగ్ స్పందించారు. ఇది దేశానికి పూర్తిగా నష్టం. ఫెడరేషన్ దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఏమి చేయగలదో చూస్తుంది" అని అన్నారు. కాగా ఈ టోర్నమెంట్‌కు కొన్ని నెలల ముందు, అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దేశంలోని రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. వినేష్ ఫోగట్ కూడా ఈ ఉద్యమంలో భాగమయింది.

Here's Video

రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి బాహుబలి నాయకుడు. చాలా రోజులుగా ఢిల్లీలో రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ఈ ఆందోళనల కారణంగా వినేష్ ఫోగట్ ఒలింపిక్స్‌కు ఆరు నెలల సన్నద్ధత వృధా అయింది. అయితే, మిగిలిన ఆరు నెలల్లో, వినేష్ ఫోగట్ ఒలింపిక్ పోటీకి పూర్తిగా సిద్ధమయింది. 50 కేజీల విభాగంలో ఆడేందుకు కఠినమైన డైట్‌ను పాటించడం ద్వారా ఆమె త్వరగా బరువు తగ్గింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now