Parliament Session 2021: ఈనెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్

దీని ప్రభావం రాబోయే బడ్జెట్ పై ఖచ్చితంగా ఉంటుందని అర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు...

Parliament of India | File Photo

New Delhi, January 15: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

బడ్జెట్ సెషన్ రెండు విడతలుగా జరుగనుంది - జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు తొలి సెషన్ మరియు మార్చి 8 నుండి ఏప్రిల్ 8 వరకు రెండో విడత జరగనుంది.

17వ లోక్‌సభ 5వ సెషన్‌లో మొత్తం 35 సిట్టింగ్‌లు ఉంటాయి - మొదటి భాగంలో 11, రెండవ భాగంలో 24 సిట్టింగ్‌లు ఉండనున్నాయి.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలైన రాజ్యసభ, లోక్ సభలను ఉద్దేశించి జనవరి 29 ఉదయం 11 గంటలకు ప్రారంభ ప్రసంగోపన్యాసం చేయనున్నారు.

ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

వివిధ స్టాండింగ్ కమిటీలు మంత్రిత్వ శాఖలు / విభాగాల నిధుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడానికి మరియు వారి నివేదికలను సిద్ధం చేయడానికి పార్లమెంట్ ఫిబ్రవరి 15న వాయిదా పడనుంది, తిరిగి మార్చి 8న ఉభయ సభలు పున: ప్రారంభమవుతాయి. ఈ మేరకు లోకసభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా, గడిచిన ఏడాది మొత్తం లాక్డౌన్ ల కారణంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. దీని ప్రభావం రాబోయే బడ్జెట్ పై ఖచ్చితంగా ఉంటుందని అర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

Telangana Assembly Session 2024: తెలంగాణకు వెళితే చికున్ గున్యా వస్తుంది, అమెరికాలో చెప్పుకుంటున్నారంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..